నా జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటి బీభత్సం చూడలేదు: మమతాబెనర్జీ

By సుభాష్  Published on  21 May 2020 12:41 PM GMT
నా జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటి బీభత్సం చూడలేదు: మమతాబెనర్జీ

నా జీవితంలో ఇలాంటి ప్రకృతి కోపాన్ని ఎన్నడూ చూడలేదని పశ్చిబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. రాష్ట్రంలో అంఫన్‌ తుఫాను తీవ్ర స్థాయిలో బీభత్సం సృష్టించిందన్నారు. అంఫన్‌ తుఫాను వల్ల రాష్ట్రంలో ఇప్పటి వరకూ 72 మంది మృతి చెందారని ఆమె వెల్లడించారు. తుఫాను సృష్టించిన బీభత్సాన్ని పరిశీలించేందుకు రావాలని తానే స్వయంగా ప్రధాని మోదీని కోరుతానని అన్నారు. ఈ తుఫాను వల్ల చాలా మంది క్షతగాత్రులయ్యారని, మరణించిన వారి కుటుంబాలకు రూ.2.5 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని మమతా ప్రకటించారు.

అంఫన్‌ వల్ల బలమైన ఈదురుగాలులు, వర్షాల వల్ల వేలాది నివాస గృహాలు నేలమట్టమయ్యాయని, బెంగాల్‌ తీరం వెంబడి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురిశాయని అన్నారు. వర్షం కారణంగా అంతర్జాతీయ విమానాశ్రయం జలదిగ్భందం అయ్యిందన్నారు. రన్‌వే, హాంగర్లు పూర్తిగా నీటితో మునిగిపోవడంతో పాటు ఎయిర్‌పోర్టులో కొన్ని నిర్మాణాలు కూలిపోయాయని అన్నారు. అలాగే కొన్ని విమానాలు సైతం ధ్వంసమైనట్లు మమతా బెనర్జీ చెప్పారు.

Next Story
Share it