143 ఏళ్లు.. 1019 టెస్టులు.. స్టోక్స్ స‌రికొత్త రికార్డ్‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Jan 2020 1:40 PM GMT
143 ఏళ్లు.. 1019 టెస్టులు.. స్టోక్స్ స‌రికొత్త రికార్డ్‌..!

2019లో ఇంగ్లాండ్ తొలిసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడ‌టంలో కీల‌క‌పాత్ర పోషించిన‌ ఆల్‌రౌండ‌ర్‌ బెన్‌ స్టోక్స్ స‌రికొత్త‌ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ చరిత్రలోనే ఈ రికార్డ్ సాధించిన తొలి ఆట‌గాడిగా అరుదైన ఫీట్‌ను సాధించాడు. సౌతాఫ్రికా జ‌ట్టుతో జ‌రుగుతున్న‌ రెండో టెస్టులో.. బెన్‌ స్టోక్స్‌ ఐదు క్యాచ్‌లను అందుకున్నాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లను పట్టుకున్న తొలి ఇంగ్లండ్‌ క్రికెటర్‌గా స్టోక్స్ ఈ రికార్డ్‌ను సాధించాడు.

ఇంగ్లండ్ 1877లో టెస్టు హోదా పొందింది. ఇప్పటివరకూ 1019 టెస్టులు ఆడింది. అయితే ఒకే ఇన్నింగ్స్‌లో ఒక ఇంగ్లండ్‌ క్రికెటర్లు నాలుగు క్యాచ్‌లను ఇప్ప‌టి వ‌ర‌కూ 23సార్లు అందుకున్నారు. వికెట్ కీప‌ర్లు త‌ప్పా మిగ‌తా వారెవ‌రూ ఐదు క్యాచ్‌లను మాత్రం పట్టుకోలేదు. చివ‌రిసారిగా 2019లో ఐర్లాండ్ జ‌ట్టుతో జ‌రిగిన‌ టెస్టులో జో రూట్‌ నాలుగు క్యాచ్‌లను ప‌ట్టుకున్నాడు. తాజాగా బెన్ స్టోక్స్‌ ఐదు క్యాచ్‌లను అందుకుని కొత్త చరిత్ర సృష్టించాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లు జుబైర్ హమ్జా, డుప్లెసిస్‌, వాన్‌డెర్‌ డస్సెన్‌, ప్రిటోరియస్‌, అన్రిచ్‌ నార్త్‌జీల క్యాచ్‌లను స్టోక్స్‌ పట్టుకోవ‌డం ద్వారా స్టోక్స్ ఈ రికార్డ్‌ను సాధించాడు.

Next Story