హీరోగా ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ త‌మ్ముడు.. ఇంత‌కీ.. ద‌ర్శ‌కుడు ఎవ‌రు..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2019 9:57 AM GMT
హీరోగా ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ త‌మ్ముడు.. ఇంత‌కీ.. ద‌ర్శ‌కుడు ఎవ‌రు..?

డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు సాయి శ్రీనివాస్ 'అల్లుడు శీను' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల 'రాక్ష‌సుడు' సినిమాతో స‌క్సెస్ సాధించిన సాయి శ్రీనివాస్ త‌దుప‌రి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Related image

ఇదిలా ఉంటే... ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త‌మ్ముడు బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన ఈ సినిమాకి పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. స‌క్స‌స్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి పవన్ సాధినేని దర్శకత్వం వ‌హిస్తున్నారు. 1980 - 90 మధ్య కాలంలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతుందని తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Next Story