బేగంపేట మెట్రో స్టేషన్ మూసివేత
By సత్య ప్రియ Published on 21 Oct 2019 7:28 AM GMTహైదరాబాద్ లోని బేగంపేట మెట్రో స్టేషన్ ఇవాళ మూసివేశారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ సోమవారం చలో ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిరసన కారులు స్టేషన్‌లోకి చొచ్చుకు రావచ్చనే అనుమానాలతో ముందస్తు జాగ్రత్తగా బేగంపేట మెట్రో స్టేషన్‌ను మూసివేశారు.
కాగా భద్రతా కారణాల రీత్యా బేగంపేట మెట్రో స్టేషన్‌లో రైలు ఆగదంటూ మెట్రో అధికారులు ముందుగానే ప్రతి మెట్రో స్టేషన్‌లో నోటీసు అంటించారు.
ప్రతీ మెట్రో స్టేషన్‌లో కూడా దీనిపై సమాచారం అందించారు. టికెట్ బుకింగ్ సెంటర్ల వద్ద నోటీసులు అంటించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇవాళ బేగంపేట మెట్రో స్టేషన్ మూసివేస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. బేగం పేట మెట్రో స్టేషన్‌లో రైలు ఆగదన్నారు. దీంతో అక్కడకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.
Next Story