విషాదానికి నిలువెత్తు నిదర్శనంలా ఇటలీ..

By అంజి  Published on  23 March 2020 10:13 AM GMT
విషాదానికి నిలువెత్తు నిదర్శనంలా ఇటలీ..

ముఖ్యాంశాలు

  • అందరిచే కంటతడి పెట్టిస్తోన్న ఇటలీ పరిస్థితి
  • 80 ఏళ్లకు పైబడిన వారికి నో ట్రీట్ మెంట్
  • కరోనా వ్యాప్తికి అసలు కారణమేంటి ?
  • శవాల దిబ్బగా ఇటలీ

ఇటలీ.. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలోనూ కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న దేశం..అత్యల్ప జనాభా ఉన్న దేశం ఇది. ఇప్పుడీ దేశాన్ని చూస్తే ఎవరికైనా గుండె చలించక మానదు. నిత్యం వందలాదిమంది కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నా..80 ఏళ్లు పైబడిన వారికి అక్కడ చికిత్స చేయడం లేదు. నిజానికి జనవరి మధ్య నుంచే ఇటలీలో కరోనా నెమ్మదిగా తనకు స్థావరాన్ని ఏర్పాటు చేసుకుందనడంలో అతిశయోక్తి లేదు. కరోనా ఇంతలా వ్యాపించడంలో డాక్టర్ల నిర్లక్ష్యం కూడా ఉంది. జనవరి నెలాఖరులో ఓ వ్యక్తి తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా..వైద్యులు దానిని కరోనా కేసుగా భావించలేదు. సాధారణ జ్వరంగా తీసుకుని తాత్కాలికంగా చికిత్స చేసి పంపించేశారు. ఆ వ్యక్తే ఇప్పుడు ఆ దేశంలో కరోనా ఇంతలా విజృభించడానికి కారణమయ్యాడు. ఆ వ్యక్తితో మాట్లాడిన వారికి, ఆ వ్యక్తి తుమ్మినపుడు లేదా దగ్గినపుడు చాలా మందికి వైరస్ వ్యాపించిందన్నది వాస్తవం.

ఇటలీలో వైరస్ ఎంతలా వ్యాపించిందంటే..మార్చి 15 నాటికి 21 వేలకు పైగా కేేసులుంటే 14 వందల మందికి పైగా కరోనా బాధితులుప్రాణాలు కోల్పోయారు. మూడ్రోజుల్లో ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువైంది. 55 వేల మందికి పైగా ప్రజలు కరోనా సోకి ఆస్పత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికి కరోనా మృతుల సంఖ్య 6000కు చేరువలో ఉంది. ఇటలీలో ఇంతలా వైరస్ వ్యాపించడానికి మరో కారణం..ప్రపంచంలోని వృద్ధులు ఎక్కువగా ఉన్న 2వ దేశం. 25 శాతం మంది 65 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారు. కరోనా వైరస్ 10 ఏళ్లలోపు పిల్లలకు 60 దాటిన వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని ముందునుంచీ అధికారులు హెచ్చరించినా అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు.

పైగా వేల ఏళ్ల చరిత్ర, అందమైన దేశం, వేల కోట్ల సంపద, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్యం ఉన్న దేశం ఇటలీనే. ఇలాంటి దేశానికి ఇంతటి విపత్తు వస్తుందని ఎవరూ ఊహించరు. కరోనాకు పుట్టినిల్లైన చైనాలో కూడా ఇటలీలో సంభవించినన్ని మరణాలు నమోదు కాలేదు. చైనాలో వైరస్ తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ఈ రెండు దేశాల మధ్య విమానాల రాకపోకలు కూడా విచ్చలవిడిగా జరరడం వైరస్ వ్యాప్తికి మరో కారణంగా తెలుస్తోంది.

ఇటలీ ఇప్పుడొక శవాల దిబ్బ

ఎంత సాంకేతిక వైద్య పరిజ్ఞానం ఉన్నప్పటికీ.. రోజురోజుకూ వేల సంఖ్యలో వస్తున్న వారందరికీ ట్రీట్ మెంట్ చేసేందుకు ఆస్పత్రులు సరిపోవడం లేదు. కనీసం గాలి పీల్చుకునేందుకు కూడా వీలుకాని పరిస్థితి. ఆస్పత్రుల్లో వెంటిలేటర్లపై కొంతమందికి వైద్యం అందిస్తున్నా..శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతున్న మరికొంతమందికి వెంటిలేటర్ పై వైద్యం చేసేందుకు వెంటిలేటర్లు లేని వైనం ఇటలీలో ఉంది. ఈ వైరస్ వ్యాపించడానికి మరో కారణం వాతావరణం. ఇటలీలో అత్యల్పంగా 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. చైనాలో 12 డిగ్రీల ఉంటేనే వైరస్ అల్లకల్లోలం సృష్టించింది. అంతెందుకు భారత్ లో 25-35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా 400 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరి ఇటలీలో అంత తక్కువ ఉష్ణోగ్రత ఉంటే వైరస్ వ్యాపించకుండా ఎలా ఉంటుంది.

కరోనా వైరస్ సోకి చనిపోతున్న వారి మృతదేహాలను చివరి చూపు చూసేందుకు కూడా కుటుంబసభ్యులను అనుమతించడం లేదు. నిత్యం వందల సంఖ్యలో శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. 24 గంటలూ శవాలను దహనం చేస్తూనే ఉన్న..గుట్టలు మాత్రం తగ్గడం లేదు. ఒకరకంగా ఇటలీ ఇప్పుడొక శవాల దిబ్బగా మారిందనే చెప్పాలి.

ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ప్రభుత్వాలు చేసిన సూచనలు పాటించడం లేదో..అక్కడి ప్రజలు కూడా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేశారు. బయటికి రావొద్దని చెప్పినా ఇష్టారాజ్యంగా తిరిగారు. ఫలితంగా ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడ్డారు. పరిస్థితి ఇంతదూరం వస్తేగాని ఇటలీ ఆంక్షలను కఠినతరం చేయలేదు. మనదేశంలో కరోనా రెండవ దశలో ఉండగానే లాక్ డౌన్ ప్రకటిస్తే...దానిని అందరూ సిల్లీగా తీసుకుంటున్నారు. అంతా మన మంచికే. పనిలేనపుడు ఇళ్లలో ఉండటమే ఆరోగ్యానికిశ్రేయస్కరం. కాదని బయట తిరిగితే ఇటలీకి పట్టిన గతే మనకీ పడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు చెప్పినట్లు నడుచుకుందాం.

Next Story