ఇండియ‌న్ క్రికెట్ బాస్ సౌరభ్‌ గంగూలీ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 1న దాదా నేతృత్వంలో బోర్డు స‌భ్యుల భేటీ ముంబయిలో సమావేశం కానుంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించాలని బీసీసీఐ భావిస్తుంది.

అయితే.. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ పాలక వర్గంలో నాలుగింట మూడో వంతు మద్దతు అవసరం. అంతేకాక‌.. సుప్రీంకోర్టు ఆమోదం కూడా తప్పనిసరి. ఒకవేళ కోర్టు అనుమతిస్తే దాదా ఆరేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. బీసీసీఐ ప్ర‌స్తుత‌ నిబంధనల ప్రకారం గంగూలీ తొమ్మిది నెలలపాటే అధ్యక్షుడిగా కొనసాగాలి. మ‌రోసారి ఆ పదవిలో కొనసాగాలంటే మూడేళ్ల విరామం ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆ నిబంధనను తొలగించ‌నున్నట్లు ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.