ఆసియా ఎలెవన్‌ జట్టు ఎంపిక.. 15 మందిలో 6గురు భారత ఆటగాళ్లకు చోటు.. ఎవరెవరంటే..?

By Newsmeter.Network  Published on  25 Feb 2020 1:16 PM GMT
ఆసియా ఎలెవన్‌ జట్టు ఎంపిక.. 15 మందిలో 6గురు భారత ఆటగాళ్లకు చోటు.. ఎవరెవరంటే..?

బంగ్లా జాతి పిత షేక్ ముజీబుర్ ర‌హ్మాన్ వందో జ‌యంతి వేడుకల సంద‌ర్బంగా మార్చిలో.. రెండు టీ20ల సిరీస్‌ను వ‌ర‌ల్డ్‌, ఆసియా ఎలెవ‌న్ జ‌ట్ల మ‌ధ్య నిర్వ‌హించాల‌ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది. అందులో భాగంగా మంగళవారం వరల్డ్ ఎలెవన్‌తో తలపడబోయే ఆసియా ఎలెవన్‌ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో ఆరుగురు భారత ఆటగాళ్లకి చోటుదక్కింది. మొత్తం 15 మందితో కూడిన బృందంలో ఆరుగురు భారత ఆటగాళ్లు ఉండగా.. బంగ్లాదేశ్ నుంచి నలుగురు, శ్రీలంక నుంచి ఇద్దరు, ఆఫ్గనిస్థాన్‌ నుంచి ఇద్దరు, నేపాల్‌ నుంచి ఒక్కరికి చోటు దక్కింది.

ఇక భారత్ నుంచి టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, లోకేశ్ రాహుల్‌, శిఖ‌ర్ ధావ‌న్‌, రిష‌బ్ పంత్‌, కుల్దీప్ యాద‌వ్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ, బంగ్లాదేశ్ నుంచి త‌మీమ్ ఇక్బాల్‌, లిట‌న్ దాస్‌, ముష్ఫికుర్ ర‌హీమ్‌, ముస్తాఫిజుర్ ర‌హ్మ‌న్ శ్రీలంక నుంచి ల‌సిత్ మ‌లింగా, తిసారా పెరీరా, ఆఫ్గ‌నిస్థాన్ నుంచి ర‌షీద్ ఖాన్‌, ముజీబుర్ ర‌హ్మన్‌.. నేపాల్ నుంచి సందీప్ లామిచానే చోటు దక్కింది.

పాకిస్థాన్ నుంచి ఒక్క ప్లేయర్‌ను కూడా జట్టులోకి తీసుకోకపోవడం గమనార్హం. పాకిస్థాన్‌ ప్లేయర్లు ఆడితే.. తమ ప్లేయర్లను పంపమని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టార్ల‌తో నిండిన ఆసియా జ‌ట్టును ఎదుర్కోబోయే వ‌ర‌ల్డ్ ఎలెవ‌న్ జ‌ట్టును ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. అలాగే సిరీస్ అధికారిక తేదీల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లు బంగ్లాలోని షేర్ ఏ బంగ్లా జాతీయ స్టేడియంలో నిర్వహించనున్నారు.

ఆసియా ఎలెవ‌న్ జ‌ట్టు : విరాట్ కోహ్లీ, శిఖ‌ర్ ధావ‌న్‌, లోకేశ్ రాహుల్‌, మహ్మ‌ద్ ష‌మీ, రిష‌బ్ పంత్‌, కుల్దీప్ యాద‌వ్‌, త‌మీమ్ ఇక్బాల్‌, ముష్ఫికుర్ ర‌హీమ్‌, లిట‌న్ దాస్‌, ముస్తాఫిజుర్ ర‌హ్మాన్‌, ల‌సిత్ మ‌లింగా, తిసార పెరీరా, ర‌షీద్ ఖాన్‌, ముజీబుర్ ర‌హీమ్‌, సందీప్ లామిచానే.

Next Story