వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్‌.. ప్లాన్‌ చేసుకోండి లేకపోతే..!

By Newsmeter.Network  Published on  22 Feb 2020 5:25 AM GMT
వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్‌.. ప్లాన్‌ చేసుకోండి లేకపోతే..!

వేతన పెంపు కోసం మార్చి 11-13 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ), ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ) పిలుపునిచ్చాయి. దీంతో మార్చి రెండో వారంలో బ్యాంకుల కార్యకలాపాలు 6 రోజుల పాటు నిలిచిపోనున్నాయి. ఒక్క సోమవారం మినహా మిగిలిన రోజుల్లో బ్యాంకులు పని చేసే అవకాశం లేదు.

20 శాతం వేతనం పెంచాలని సంఘాలు డిమాండ్‌ చేస్తుండగా.. 12.5శాతం పెంచేందుకు బ్యాంకుల యాజమాన్యాలు అంగీకరించాయి. అయితే.. దీనికి సంఘాలు ఒప్పుకోవడం లేదు. తమకు 20శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. సమ్మె జరిగితే.. మార్చి 8వ తేదీ నుంచి 15 వరకు ఒక్క సోమవారం మినహా మిగతా రోజుల్లో బ్యాంకులు పని చేయవు. 8వ తేదీ ఆదివారం, 10వ తేదీ మంగళవారం హోలీ సందర్భంగా సెలవు. 11 నుంచి 13 వరకు బ్యాంకులు బంద్‌, 14న రెండో శనివారం, 15న ఆదివారం బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఒక్క 9న సోమవారం మాత్రం పనిచేయనున్నాయి. ఖాతాదారులంతా ముందే ప్లాన్‌ చేసుకోవాలి.. లేకపోతే ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉంది. ఏటీఎంలలో నగదు నిల్వ నిండుకుంటే.. కష్టాలు రెట్టింపు అవుతాయి.

Next Story