పరుగులు పెడుతోన్న పసిడి..

By రాణి  Published on  20 Feb 2020 11:41 AM GMT
పరుగులు పెడుతోన్న పసిడి..

హమ్మయ్య..బంగారం ధర కాస్త తగ్గిందనుకునే లోపే మళ్లీ పెరుగుతోంది. వరుసగా మూడో రోజు..ఢిల్లీ లో బంగారం ధర రూ.300 పెరగడంతో..10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.40,650, 24 క్యారెట్ల బంగారం ధర రూ.41,850 కి చేరింది. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం (22 క్యారెట్లు) ధర రూ.39,800 ఉండగా..24 క్యారెట్ల బంగారం ధర రూ.42,985 కు పెరిగింది. వరుసగా మూడ్రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధర..గురువారం మరింత పెరిగి రికార్డుకెక్కింది.

వెండి కూడా బంగారం మార్గంలోనే పయనిస్తోంది. కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.1,047 పెరిగి రూ.48,652కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు (31.5గ్రాములు) బంగారం ధర 1,606.60డాలర్లు, వెండి ధర 18.32 డాలర్ల వద్ద స్థిరపడింది.

కోవిడ్ 19ఎఫెక్ట్ విలువైన బంగారం, వెండి, ఇతర లోహాలపై పడటంతో..వాటికి డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు ఊపందుకున్నాయి. అందులోనూ ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.

Next Story