హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లో గత నెలలో ఉత్తమ్ రెడ్డి ఇంట్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రెండు కోట్లు విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను దొంగిలించిన దుండగుడిని పోలీసులు గుర్తించారు. చోరీకి పాల్పడింది కరుడుగట్టిన నేరగాడు ఆరిఫ్‌ అని పోలీసులు చెప్పారు. బంజారాహిల్స్ నుంచి సీసీఎస్‌కు కేసు బదిలీ చేశారు. నిందితుడి కోసం ముమ్మరంగా గాలించి బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.