యువతి సజీవ దహనం కేసులో బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Oct 2019 6:42 AM GMT
యువతి సజీవ దహనం కేసులో బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు

ఓ యువతి సజీవదహనం కేసులో.. 16 మందికి మరణ శిక్ష విధిస్తూ బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో జరిగిన ఈ కేసును విచారించిన న్యాయస్థానం 62 రోజుల్లోనే తీర్పు ఖరారు చేసింది.

గతంలో 'మదర్సా' ప్రిన్సిపాల్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ.. నుస్రత్‌ అనే బాధితురాలు మార్చి 27న పోలీలుకు ఫిర్యాదు ఇచ్చిది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసు వెనక్కి తీసుకోవాలంటూ.. నుస్రత్ కుటుంబం పై నిందితుడి తరుపు వ్యక్తులు ఒత్తిడి పెంచారు. ఎటువంటి ఫలితం లేకపోవడంతో.. ఏప్రిల్ 6 న ఒక పరీక్ష రాయడం కోసం మదర్సా కు వచ్చిన నుస్రత్ పై పెట్రోల్ పోసి అంటించారు. దాడిలో నుస్రత్‌ 80 శాతం కాలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. నాలుగు రోజులు మరణంతో పోరాడి చివరకు మృతి చెందింది.

నుస్రత్ దుర్మరణం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దేశంలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగి పోతున్నాయంటూ.. నిరసనగా యువతీ యువకులు పలుచోట్ల ర్యాలీ నిర్వహించారు. రాజధాని ఢాకాలో కొన్ని రోజులపాటు ఆందోళనలు దీనిపై జరిగాయి. దీంతో దోషులుగా తేలిన వారికి తప్పకుండా శిక్షపడేలా చూస్తామని ప్రధాని షేక్ హసీనా హామీ ఇవ్వడంతో ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు 16 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం 16 మందికి మరణ శిక్ష విధిస్తున్నట్లు బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Next Story