అర్దరాత్రి బండ్ల గణేష్ హల్ చల్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Oct 2019 3:17 PM IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి నిర్మాత బండ్లగణేష్ హల్చల్ చేశారు. బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి తనను బెదిరించినట్లు పొట్లూరి వరప్రసాద్ జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నిర్మాత బండ్ల గణేష్ పై 420, 448, 506 r/w IPC సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. బండ్ల గణేష్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతనికి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే..అంతకు ముందు పీవీవీపై బండ్ల గణేష్ ఫిర్యాదు చేశారు. తనను కిడ్నాప్ చేసి, హత్య చేయాలని చూస్తున్నారని పీవీపీపై బండ్ల గణేష్ ఫిర్యాదు చేశారు.
Next Story