బైంసా బాధితుల కోసం జోలె పడతా..

By Newsmeter.Network
Published on : 14 Jan 2020 8:41 PM IST

బైంసా బాధితుల కోసం జోలె పడతా..

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఓ వర్గం ప్రజలు మ‌రో వ‌ర్గానికి చెందిన 40 ఇళ్లను దగ్ధం చేసినా సీఎం ఎందుకు స్పందించడం లేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఎంఐఎం కార్యకర్తలు అధికార టీఆర్ఎస్ అండతో పాల్పడిన దౌర్జన్యంపై ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం దారుణ‌మ‌న్నారు.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కెసిఆర్ కీలుబొమ్మగా మారిపోయారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చే భిక్ష కోసం ఎదురు చూడడం లేదని స్పష్టం చేశారు. బైంసా మున్సిపాలిటీని ఎంఐఎంకు కట్టబెట్టడం కోసం టిఆర్ఎస్ తాపత్రయ పడుతోందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా భైంసా లాంటి ఘటనలు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి బిజెపిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

Next Story