బాలాకోట్ దాడుల వీడియో విడుదల...! ప్రతిపక్షాలు ఏమంటాయో..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2019 11:02 AM GMT
బాలాకోట్ దాడుల వీడియో విడుదల...! ప్రతిపక్షాలు ఏమంటాయో..?!

పుల్వామా దాడికి ప్రతీకార చర్యలో భాగంగా భారత వాయుసేన పీవోకేలోని ఉగ్రస్థావరం బాలాకోట్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో ఈ ఎటాక్‌ జరిగింది. ఈ దాడిలో 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని భారత ప్రభుత్వం ప్రకటించింది.బాలాకోట్ ఎయిర్‌ స్ట్రైక్స్‌కు సంబంధించిన ప్రమోషనల్ వీడియోను ఎయిర్ ఫోర్స్ రిలీజ్ చేసింది. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్ డే సందర్భంగా ఎయిర్‌ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్‌ భదౌరియా వీడియో రిలీజ్ చేశారు.

Image result for balakot attack

ఈ వీడియో 1 నిమిషం 24 సెకన్లు ఉంది. ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన ఫైలట్లు ఒక రూమ్‌లో మాట్లాడుకుంటున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తాయి. తర్వాత యుద్ధ విమానాల దగ్గరకు పైలట్లు పరిగెత్తుకుంటూ వెళ్లిన దృశ్యాలు చూడొచ్చు. ఇండియా యుద్ధ విమానాలు టేకాఫ్ తీసుకోవడం కనిపిస్తోంది. బాలాకోట్ ఉగ్రశిబిరాలపై బాంబులు జారవిడచడాన్ని కూడా ఈ వీడియోలో చూడొచ్చు. బాలాకోట్‌పై దాడి చేయలేదన్న వారికి ఈ వీడియో దిమ్మతిరిగిపోయే సమాధానం.

Image result for balakot attack

పీవోకేలోని ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్‌లో బాలాకోట్‌ ఉంది. ఫిబ్రవరి 14వ తేదీన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పుల్వామా దాడులకు ఎలా ప్రతీకారం తీర్చుకుందో వీడియోలోని వాయిస్ ఓవర్‌లో వినిపిస్తుంది. పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. లేటెందుకు ఇదిగో ఈ వీడియోలో మన ఎయిర్‌ ఫోర్స్ దమ్మును మీరూ చూడండి.

Image result for balakot attackNext Story