బల్కంపెట్ ఎల్లమ్మ ఆలయంలో రౌడీ గ్యాంగ్ హాల్‌చల్‌

హైదరాబాద్‌: బల్కంపెట్ ఎల్లమ్మ దేవాలయంలో రౌడీ గ్యాంగ్ హల్చల్ హాల్‌చల్‌ చేసింది. కొంత మంది ఆలయంలో టెంట్‌ రెంట్‌కు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టెంట్‌ యజమానిని వారి దగ్గరకు వెళ్లి.. సమయం దాటింది టెంట్ కాళీ చేయమని కోరారు. దీంతో ఆ వ్యక్తులు టెంట్ హౌస్ నిర్వహకులని వెంట బడి చితకబాదారు.

అయితే మొత్తం 30 మంది రౌడీలు టెంట్‌ యజమానిని చితకబాదడంతో.. తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కేస్ నమోదు చేశారు. అయితే వెంటనే తమపై కేసు వెనక్కి తీసుకోవాలని రౌడీ గ్యాంగ్‌.. తమను బెదిరింపు గురిచేస్తున్నారని బాదితుని తరుపున కుటుంబ సభ్యులు వాపోయారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్