రూ. 1.25 కోట్ల విరాళం అందజేసిన బాలయ్య

By Newsmeter.Network  Published on  3 April 2020 1:54 PM IST
రూ. 1.25 కోట్ల విరాళం అందజేసిన బాలయ్య

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రూ. 1.25కోట్లు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. అందులో రూ. 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి, మరో రూ. 50 లక్షలు ఆంధ్రప్రదేశ్‌ సీఎం సహాయనిధికి అందించనున్నారు. మరోవైపు తెలుగు సినీ కార్మికుల సహాయార్థం చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీసీ (కరోనా క్రైసిస్‌ చారిటీ)కి రూ. 25లక్షలు ప్రకటించారు. ఈ మేరకు రూ. 25లక్షల చెక్కును ఆ సంస్థ ఎగ్జిక్యుటివ్‌ సభ్యుడు సి. కల్యాణ్‌కు అందించారు.

Also Read :ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినం.. ఎందుకంటే..?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్‌ భారిన పడి అనేక మంది మృతి చెందారు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ మూడు రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా నివారణకు రెండు రాష్ట్రాలు ప్రత్యేక బడ్జెట్‌ను విడుదల చేశాయి. ఇళ్లకే పరిమితమై పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఉచిత బియ్యం, నిత్యావసర సరులు అందిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వాలకు అండగా పలువురు వ్యాపారులు, సినీ ప్రముఖులు, ప్రజలు తమకు తోచిన సాయాన్ని అందిస్తున్నారు. దీంతో బాలకృష్ణ ఇరు రాష్ట్రాలకు రూ. 50లక్షల చొప్పున కోటి రూపాయలు ప్రకటించారు.

Also Read : రెండోసారి కరోనా నిర్దారణ పరీక్ష.. ఆశ్చర్యపోయిన ట్రంప్‌..!

చిరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీసీ ట్రస్ట్‌కు బాలకృష్ణ రూ. 25లక్షలు అందించారు. ఈ చెక్కును సంస్థ ఎగ్జిక్యుటివ్‌ మెంబర్‌ సి. కల్యాణ్‌కు అందించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వ్యాధి సోకకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇండ్లకే అందరూ పరిమితమై కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బాలయ్య ఆర్థిక సాయం పట్ల చిరు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సీఎంల సహాయ నిధికి, సినీ కార్మికుల చారిటీకి విరాళం అందించిన బాలకృష్ణకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి కష్ట సమయంలోనూ ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే మీరెప్పుడు తోడుంటారు అంటూ చిరు ట్విట్టర్‌లో బాలకృష్ణను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.

Next Story