గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం వేగంగా మెరుగు పడుతోంది. నాన్న ఎంతో హుషారుగా వ్యవహరిస్తున్నారని బాలు కుమారుడు ఎస్పీ చరణ్ అన్నారు. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆయన సోమవారం సాయంత్రం వీడియోను విడుదల చేశారు. ఈనెల 10న నేను మీడియాతో మాట్లాడాను.. ఈ నాలుగు రోజుల్లో నాన్న ఆరోగ్యంలో ఎంతో మార్పు వచ్చింది. ఫిజియోథెరపీ కొనసాగుతోంది.