పాపం బాలయ్య.. ఖచ్చితంగా ఇది అమాయకత్వమే !

By సుభాష్  Published on  18 Jan 2020 4:05 AM GMT
పాపం బాలయ్య.. ఖచ్చితంగా ఇది అమాయకత్వమే !

నందమూరి బాలకృష్ణకు జడ్జ్ మెంట్ లేదా ? సరైన కథలను ఎలాగూ బాలయ్య పట్టుకొడు.. ఇక డైరెక్టర్ లను కూడా సరైన వాళ్లను పెట్టుకోకపోతే అదీ ఖచ్చితంగా బాలయ్య అమాయకత్వమే. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే.. బాలయ్య కెరీర్ లోని సూపర్ హిట్ చిత్రాల్లో 'సమరసింహారెడ్డి, నరసింహనాయుడు' అతి ముఖ్యమైనవి. ఈ సినిమాలతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయిందనేది నిజం. అభిమానులు సైతం బాలయ్య నుండి ఎలాంటి సినిమా కావాలని అడిగితే ఒక 'నరసింహనాయుడు' ఒక 'సమరసింహారెడ్డి' కావాలని కోరుకుంటారు. కానీ అదే డైరెక్టర్ తో బాలయ్య మళ్ళీ సినిమా చేస్తానంటే మాత్రం బాలయ్య అభిమానులు కూడా భయపడే పరిస్థితి ఉంది. ఇంతకీ ఈ రెండు చిత్రాలను డైరెక్ట్ చేసింది బి.గోపాల్. బాలయ్యది, ఆయనది సూపర్ హిట్ కాంబినేషనే.. కాదనలేం.

కానీ ఇప్పుడు ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా..? గోపాల్ ఎప్పుడో సైడ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయాడు. అయినా బాలయ్య మాత్రం మరోసారి బి.గోపాల్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. బాలయ్య వద్దకు ఒక మంచి కథ వచ్చిందని, దాన్ని బి.గోపాల్ అయితేనే సమర్థవంతంగా తెరకెక్కించగలరని బాలయ్య భావిస్తున్నాడు. పాపం బాలయ్య ఇంతే. మార్కెట్ చూసుకోడు.. కాంబినేషన్ లు సెట్ చేసుకోడు. అందుకే బాలయ్య సినిమాకి ఒక చిన్న హీరో సినిమాకి వచ్చే కలెక్షన్స్ కూడా రావట్లేదు. అయినా బాలయ్య తగ్గడు, బోయపాటి సినిమా తర్వాతే గోపాల్ ప్రాజెక్ట్ ఉండే అవకాశముంది.

Next Story
Share it