బాల‌య్య ప్లానింగ్ అదిరింది..! ఇంత‌కీ.. ఏంటా ప్లాన్..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sep 2019 7:23 AM GMT
బాల‌య్య ప్లానింగ్ అదిరింది..! ఇంత‌కీ.. ఏంటా ప్లాన్..?

నంద‌మూరి న‌టసింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం 105వ చిత్రాన్ని చేస్తున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్. ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకున్న ఈ సినిమా అక్టోబ‌ర్ 5 నుంచి హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకోనుంది. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ సినిమా డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

ఈ సినిమా త‌ర్వాత 106వ చిత్రాన్ని ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుతో చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. డిసెంబ‌ర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇక 107వ చిత్రాన్ని డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తో చేయ‌నున్నారని తెలిసింది. 'పైసా వ‌సూల్' చేసిన‌ప్పుడే పూరి, బాల‌య్య క‌లిసి మ‌రో సినిమా చేయాలి అనుకున్నారు. ఇటీవ‌ల ఈ మూవీ క‌న్ ఫ‌ర్మ్ అయ్యింద‌ని స‌మాచారం.

ఇక 108వ చిత్రాన్ని క్రిష్ తో చేయ‌నున్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. బాల‌య్య క్రిష్ తో 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' సినిమా చేసారు. ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. అయితే... ఇటీవ‌ల క్రిష్ తో చేసిన క‌థానాయ‌కుడు 1, క‌థానాయ‌కుడు 2 ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వ‌డంతో క్రిష్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌దుప‌రి చిత్రం ఏంటి అనేది ప్ర‌క‌టించ‌లేదు. మ‌రోసారి బాల‌య్య‌తో సినిమా చేసేందుకు క్రిష్ క‌థ రెడీ చేస్తున్నార‌ని.. బాల‌య్య కూడా ఓకే చెప్పార‌ని తెలిసింది. ఈ విధంగా బాల‌య్య వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తుండ‌డం అదిరింది క‌దూ..!

Next Story