లో దుస్తులతోనే బాగ్దాది డీఎన్ఏ లోగుట్టు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 12:01 PM GMT
లో దుస్తులతోనే బాగ్దాది డీఎన్ఏ లోగుట్టు..!

అబూ బకర్ అల్-బాగ్దాదీ ని హతమార్చే ముందుగా గుర్తించేందుకు కుర్దిష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎస్ డీఎఫ్) గూఢచారులు అబూ బకర్ లో దుస్తులను దొంగిలించారు. బాగ్దాదీ అవునా కాదా అని దొంగిలించిన అండర్వేర్ తో డీఎన్ఏ ను పరీక్షించి అతనని నిర్ధారించారు.

సిరియాలో యుఎస్ ప్రత్యేక దళాల ఆపరేషన్ కు ముందు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) నాయకుడి కడలికలను గుర్తించారు. అతడి స్థావరాన్ని గుర్తించడంలో ఇంఫార్మర్ సైతం కీలక పాత్ర పోషించారు. అక్టోబరు 27 న దాడి గురించి అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ "కుర్దిష్ దళాలు సమాచారాన్ని అందించడంలో ఉపయోగపడ్డాయని, కానీ సైనిక దాడిలో వారి పాత్ర" న్ని లేదని ప్రకటించిచారు. కాని..బాగ్దాదిని పట్టుకోడంలో ఎస్ డీఎఫ్ ముఖ్య భూమిక పోషించిందని పోలట్ కెన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

సొంతగా తమ గూఢచార వ్యవస్థ శక్తి , సామర్ధ్యాలను పూర్తిస్థాయిలో ఉపయోగించి అల్-బాగ్దాది స్థావరాన్ని గుర్తించామన్నారు నిఘా బృందానికి నేతృత్వం వహించిన కెన్‌. ఈ ఆపరేషన్ లో ఆమెరికా బలగాలు వాయుమార్గంలో స్థావరాన్ని చేరుకునే దగ్గర నుంచి ఆపరేషన్‌ను విజయం సాధించే చివరి నిమిషం వరకు తమ నిఘా బృందం నేతృత్వం వహించిందని కెన్ పేర్కొన్నాడు. బాగ్దాది ఆచూకి తెలుసుకోడానికి మే 15 నుంచి సీఐఏ తో ఎస్డీఎఫ్ కలిసి పనిచేసిందన్నారు కెన్. అమెరికా సైన్యం దాడి చేసిన అబూబాకర్ ఇడ్లిబ్ లో తలదాచుకున్న స్థావరాన్ని కూడా తమ నిఘా వ్యవస్థే గుర్తించిందన్నారు.ఐసిస్ నాయకుడు తన స్థావరాన్నిమార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఇన్‌ఫార్మర్‌ తమతో చెప్పాడని ఓ అధికారి తెలిపారు.

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూపుకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధ సమయంలో ఎస్‌డిఎఫ్ దళాలు అమెరికాకు మిత్రపక్షంగా వ్యవహరించాయి. అయితే ...ఈ నెల ప్రారంభంలో అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర సిరియా నుంచి అమెరికా దళాలను ఉపసంహరించారు.యూఎస్ సైన్యం ఉపసంహరణతోనే ఆ ప్రాంతాల్లో టర్కీకి క్రాస్-బోర్డర్ దాడిని ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

సొరంగంలోకి వెళ్లి తలదాచుకున్న బాగ్దాదిని బయటకు వచ్చి లొంగిపోవాలని యూఎస్ బలగాలు హెచ్చరించాయి.అయినా..బాగ్దాది వినలేదు. అమెరికా సేనలు సొరంగంలో బాగ్దాదిని వెంటాడాయి.బాగ్దాది తన ముగ్గురు కుమారులతో స్వరంగంలోకి పరిగెత్తాడు. అమెరికా బలగాలు చేరువ అవుతుంటే తన దగ్గర ఉన్న సూసైడెర్ బామ్ జాకెట్ తో తనను తాను పేల్చుకున్నాడు. దీంతో అతనితో ఉన్న ముగ్గురు పిల్లలు కూడా చనిపోయారు.

ఘటనా స్థలంలో వెంటనే యూఎస్ సేనలు నిర్ధారణ పరీక్షలు నిర్వహించాయి. ప్రత్యేక దళాలలోని సాంకేతిక నిపుణులతో పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షల్లో బాగ్దాదీ డీఎన్ఏ నమూనాలను కూడా పరీక్షించారు.అప్పటికప్పుడు డీఎన్ఏ ను గుర్తించే సూక్ష పరికరం బృందం వెంట ఉంటుంది. దీని ద్వారా బాగ్దాది మరణించినట్లు గుర్తించారు. దీనికి తోడు ఛిద్రమైన శరీర భాగాలను సైతం సైన్యం వెంట తెచ్చింది.

ఇస్లామ్ మత ఆచారం ప్రకారం బాగ్దాదీకి అంత్య క్రియలు నిర్వహించినట్లు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీకి అజ్ఞాత అధికారి చెప్పారు. 2011 లో పాకిస్తాన్లో అల్ ఖైదా స్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ను తుదముట్టించిన విధంగానే బాగ్దాదిని హతమార్చారు.

Next Story