ఐఎస్ ఐ చీఫ్ బాగ్దాది ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. సిరియాలో తలదాచుకున్న అబూబకర్ ను అమెరికా స్తెన్యం చుట్టుముట్టడంతో .. వారికి చిక్కకూడదనే ఉద్దేశ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు యూఎస్ మీడియా కథనాలు ప్రచురించింది. సిరియా, ఇరాక్ దేశాల్లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో బాగ్దాది ఐసిస్ ను స్థాపించాడు, ఇస్లామిక్ రాజ్యం పేరుతో మారణహోమం సృష్టించాడు. ఐసిస్ చేసిన నరమేధంలో లక్షల మంది అశువులు బాశారు. ఐసిస్ చర్యలప్థె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ సిరియాలోని ఉగ్రస్థావరాలప్తె దాడులకు ఆదేశించారు. అధ్యక్షుడి ఆదేశాలు అందుకున్న అమెరికా స్తెన్యం బాగ్దాది ఉన్న ప్రాంతాలను ముట్టంచింది. దీంతో అమెరికా స్తెన్యానికి దొరకడం ఇష్టంలేని బాగ్దాది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సూస్తెడ్ చేసుకున్నాడా? అమెరికా స్తెన్యమే హతమార్చిందా అనే విషయంప్తె స్పష్టత రావాల్సి ఉంది. అయితే..బాగ్దాది మృతిని ట్రంప్ ధృవీకరించినట్లు తెలుస్తోంది.

 

 

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.