బాగ్దాది వారసుడొచ్చాడు...!! కాని వివరాలు సీక్రెట్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Nov 2019 8:01 AM GMT
బాగ్దాది వారసుడొచ్చాడు...!! కాని వివరాలు సీక్రెట్..!

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత అబూబకర్ అల్ బాగ్దాది మృతిని ఆ సంస్థ నిర్ధారించింది. తమ కొత్త నాయకుడి పేరును ఇబ్రహీం ఆల్ హమ్మి ఆల్ ఖురేషి గా ప్రకటించింది. అయితే ..ఖురేషీ కు సంబంధించి ఎలాంటి ఇతర సమాచారాన్ని ఇవ్వలేదు. అంతే కాదు బాగ్దాది తో పాటు అతని సన్నిహిత అనుచరుడు అబూ హసన్ ఆల్ ముహాజిర్ మరణించాడని ధ్రువీకరించారు. 2016 నుంచి అతడు ఐసీస్‌ ప్రతినిధిగా ఉన్నాడు. ఆదివారం అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో అతను హతమైనట్లు గా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఒక ఆడియో సందేశంలో తెలిపింది. దశాబ్ద కాలంగా ప్రపంచాన్ని వణికించిన బాగ్దాదిని సిరియాలోని ఒక రహస్య స్థావరంలో ఉండగా అమెరికా దళాలు మట్టుబెట్టాయి. ఎస్ డి ఎఫ్ దళాల సహాయంతో అమెరికా సైన్యం అత్యున్నత స్థాయిలో ఈ వ్యూహరచన చేసింది. అయితే బాగ్దాది మరణించిన ఐదు రోజుల తర్వాత తొలిసారిగా ఐసీస్ ఒక ఆడియో టేప్ ను విడుదల చేసింది. ఈ టేప్లో బాగ్దాదీ లేని లోటును అతి త్వరలోనే పూడ్చుకుంటామని, కొత్త బలం పుంజుకొని విజృంభిస్తామని, అమెరికా అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చింది. తాము ఇప్పటికే అమెరికా, సెంట్రల్ ఆఫ్రికా దేశాల ముంగిట్లోకి వచ్చామని, మిగిలిన ప్రపంచ దేశాలకు విస్తరిస్తామని పేర్కొంది.

Next Story