13 నెల‌ల బాలుడితో స‌హా తల్లి ఆత్మహత్య.. ఎందుకంటే..?

By Medi Samrat  Published on  11 Oct 2019 7:17 AM GMT
13 నెల‌ల బాలుడితో స‌హా తల్లి ఆత్మహత్య.. ఎందుకంటే..?

మేడ్చల్ : జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని షిరిడి హిల్స్‌ మజీద్ సమీపంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత తన 13 నెలల బాబుతో కలిసి సంపులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. దౌల్తాబాద్ చందానగర్‌కు చెందిన మల్లేష్‌ తన భార్యతో కలిసి 10 ఏళ్ల కిందట నగరానికి వలస వచ్చి షిరిడి హిల్స్‌లో నివాసముంటున్నాడు. మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో లావణ్యను గత ఆరేళ్ల కిందట రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. గత కొంత కాలంగా లావణ్య తరచుగా భర్త మల్లేష్‌తో గొడవ పడేది. కుటుంబ కలహాల నేపథ్యంలో తెల్లవారుజామున లావణ్య తన కుమారుడితో కలిసి సంపులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story