చంద్రబాబు పిల్లిలా అరిస్తే పులిలా గాండ్రించారని..!- ఎమ్మెల్యే అంబటి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2019 1:30 PM GMT
చంద్రబాబు పిల్లిలా అరిస్తే పులిలా గాండ్రించారని..!- ఎమ్మెల్యే అంబటి

తాడేపల్లి: అవినీతి రహిత పాలన అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిరంతరం శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే అంబటి అన్నారు. చంద్రబాబుకు విషం కక్కే కార్యక్రమానికి ఒక వర్గం మీడియా వంతపాడుతుందని విమర్శించారు. తమకు సంబంధించిన మీడియాతో తండ్రి,కొడుకు ప్రజలను తప్పు దోవ పట్టించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పిల్లిలా అరిస్తే..పులిలా గాండ్రించారని వారి మీడియా రాస్తుందన్నారు. దేవతలు యజ్క్షం చేస్తుంటే రాక్షసులు అడ్డుకున్నట్లు.. సీఎంగా వైఎస్‌ జగన్ మంచి పనులు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన పాలనలో వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని అంబటి ఆరోపించారు. రివర్స్ టెండరింగ్‌తో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయన్నారు. రివర్స్ టెండరింగ్‌తో ఒక్క పోలవరం ప్రాజెక్ట్‌లోనే రూ.780 కోట్లు ఆదా అయ్యాయని అంబటి చెప్పారు. చంద్రబాబు రుణమాఫీ హామీకి, వైఎస్ జగన్‌కు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. అనుమతులులేని ఇంట్లో చంద్రబాబు ఎందుకు ఉంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సుజనా చౌదరి కమలంలో ఉన్న పచ్చపుష్పం అంటూ అంబటి నిప్పులు చెరిగారు. రివర్స్‌ టెండరింగ్‌లో వందల కోట్లు మిగిలింది సుజనా చౌదరికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గతంలో 'మేఘా' కంపెనీకి చంద్రబాబు కాంట్రాక్ట్‌లు ఇవ్వలేదా అని మీడియా సాక్షిగా అంబటి క్వశ్చన్ చేశారు.

Next Story
Share it