రనౌట్ల నుంచి తప్పించుకునేందుకు.. పాక్‌ క్రికెటర్ల కొత్త పద్దతి

By Newsmeter.Network  Published on  25 Feb 2020 9:49 AM GMT
రనౌట్ల నుంచి తప్పించుకునేందుకు.. పాక్‌ క్రికెటర్ల కొత్త పద్దతి

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్ఎల్‌)లో వింతలు చోటు చేసుకుంటున్నాయి. బ్యాట్స్‌మెన్లు గందరగోళానికి గురవుతున్నారు. ఒకే ఎండ్‌కు ఇద్దరు పరిగెత్తడం.. ప్లేయర్లు ఇద్దరు కన్‌ప్యూజన్‌తో పిచ్‌ మధ్యలో ఆగిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గల్లీ క్రికెటర్ల మాదిరిగా రనౌట్లు అవుతున్నారు. తాజాగా ఆదేశ యువ క్రికెటర్‌ గందరగోళానికి గురై కొత్త తరహాలో రనౌటవ్వబోయాడు.

పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు మోయిన్‌ఖాన్‌ కుమారుడు అజామ్‌ఖాన్‌ గ్లాడియేటర్స్ తరుపున ఆడుతున్నాడు. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పటికి.. అతని తండ్రి ఫైరవీతోనే గ్లాడియేటర్స్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజామ్‌ ఖాన్ మెరుపులు మెరిపించాడు. 30 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు బాది 46 పరుగులు చేశాడు. దీంతో.. 157పరుగుల లక్ష్యాన్ని గ్లాడియేటర్స్‌ జట్టు మరో 6 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో జట్టు స్కోర్ 140 వద్ద అజామ్‌ ఖాన్‌ బ్యాట్‌ ని తలక్రిందులుగా పట్టుకోని కొద్దిలో రనౌట్‌ మిస్సైయ్యాడు. బంతి వికెట్లకి సమీపించే లోపే అజామ్ ఖాన్ క్రీజు దగ్గరికి చేరుకున్నాడు. కానీ.. బ్యాట్‌ని ఎడమ చేతి నుంచి కుడిచేతికి మార్చుకునే సమయంలో తత్తరపాటుకి గురయ్యాడు. బ్యాట్ పూర్తిగా రివర్స్ అయిపోగా.. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ వికెట్లపైకి దాన్ని విసిరాడు. దీంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో క్రీజులో బ్యాట్ హ్యాండిల్‌ని ఉంచాల్సి వచ్చింది. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రనౌట్ నుంచి తప్పించుకునేందుకు కొత్త తరహా పద్ధతిని పాక్ క్రికెటర్లు కనిపెట్టారంటూ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.



Next Story