ఆజాదీ మార్చ్ ఇమ్రాన్ తల రాతను మారుస్తుందా?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 6:47 PM GMT
ఆజాదీ మార్చ్ ఇమ్రాన్ తల రాతను మారుస్తుందా?!

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ అట్టుడికిపోతోంది. స్వతంత్ర పోరాటం తారాస్థాయికి చేరింది. ప్రజల ఆధ్వర్యంలో సాగుతున్న ఆజాదీ మార్చ్, పాక్ రాజధాని ఇస్లామాబాద్‌ వైపుగా సాగుతోంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిరం కుశంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ లక్షమంది ఆందోళనకారులు ఇస్లామాబాద్‌ వైపు బయలుదేరారు. జమాతే ఉలెమా ఇస్లాం పార్టీ ఆధ్వర్యంలో ఈ భారీ మార్చ్ మొదలైంది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ ఆందోళనకు మద్ద తు పలికాయి. ఈ మహా ప్రదర్శన కోసం ఏకంగా వంద కోట్ల రూపాయలు సేకరించడం గమనార్హం. కరాచీ సహా వివిధ నగరాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. దాదాపు లక్షమందితో కూడిన ఈ ర్యాలీ ఇస్లామాబాద్ వైపుగా సాగుతోంది. ఈ నెల 31న రాజధానికి చేరుకోనున్న ఈ భారీ మార్చ్ ప్రధానికి వ్యతిరేకంగా తమ గొంతు వినిపించనుంది.

Next Story