ఈ యాంటీవైరస్ మీ పీసీలో ఉంటే తస్మాత్ జాగ్రత్త!

By రాణి  Published on  8 Feb 2020 7:43 AM GMT
ఈ యాంటీవైరస్ మీ పీసీలో ఉంటే తస్మాత్ జాగ్రత్త!

మీ కంప్యూటర్ లో అవాస్ట్ యాంటీ వైరస్ ప్రోగ్రామ్ అవాస్ట్ లోడ్ చేసుకున్నారా? అయితే ఇది మీ కోసమే. యాంటీవైరస్ సాఫ్ట్ వేర్ సంస్థ అవాస్ట్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది కంప్యూటర్లు, లాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లలోకి తన సాఫ్ట్ వేర్ ను లోడ్ చేసింది. అయితే సంస్థ తన కోట్లాది మంది వాడకందారుల సమాచారాన్ని సేకరించి వివిధ కంపెనీలకు అమ్మేస్తోందట. ఈ విషయం మదర్ బోర్డ్, పీసీ మ్యాగ్ అనే రెండు పత్రికలు సంయుక్తంగా చేసిన దర్యాప్తులో బయటపడింది.

ఈ కంపెనీలకు ఉన్న ఒక ఉప సంస్థ జంప్ షాట్ ఈ పనిని చేస్తోంది . డేటా చౌర్యం లో ఈ సంస్థ ఆరితేరిందని కూడా పత్రికల అధ్యయనంలో బయటపడింది. నిజానికి ఈ సమాచారం చాలా వ్యక్తిగతమైనది, గోప్యమైనది. అలాంటి డేటాను కూడా బహిర్గతం చేయడం జరుగుతోందని అధ్యయనంలో తేలింది. వాడకందారుల బ్రౌజింగ్ హిస్టరీని షేర్ చేసుకుంటున్నాయని తేలింది. అంటే అవాస్ట్ కి ఉన్న 435 మిలియన్ల వాడకందారుల సమాచారం ఈ విధంగా బట్టబయలు అయిపోయిందని వెల్లడైంది.

అవాస్ట్ కస్టమర్లలో గూగుల్, యెల్ప్, మైక్రోసాఫ్ట్, మెకిన్సీ, పెప్సీ, సొఫోరా, హోం డిపో, కొండెనాస్ట్, ఇన్ ట్యూట్, తదితరులు ఉన్నారు. గూగుల్ సెర్చిలో వెతికిన చోట్లు, వెళ్లిన చోట్లు లేదా వెతికే చోట్లకు సంబంధించిన జీపీఎస్ కోఆర్డినేట్లు, సెర్చి చేస్తున్న కంప్లెయింట్లు, లింకడ్ ఇన్ పేజీలు, యూట్యూబు విడియోలు, వెతికే పోర్న్ సైట్ల వివరాలు అవాస్ట్ అందచేసిందని ఇప్పుడు అనుమానిస్తున్నారు. పోర్న్ సైట్లలో యూ పోర్న్, పోర్న్ హబ్ వంటి సైట్లను ఓపెన్ చేస్తే ఆ వివరాలను కూడా లీక్ చేసినట్టు ఇప్పుడు అనుమానిస్తున్నారు. జంప్ షాట్ కి కూడా వంద మిలియన్లకు పైగా ఖాతాదారులు ఉన్నారు. ఈ వివరాలన్నీ బయటపడ్డాక మోజిల్లా, ఓపెరా, గూగుల్ వంటి సంస్థలు తమ తమ కంప్యూటర్ల నుంచి అవాస్ట్ సాఫ్ట్ వేర్లను తొలగించాయి.

Next Story