నడుస్తున్న ఆటో లోంచి దూకి ప్రాణాలు కాపాడుకుంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Sep 2019 12:13 PM GMT
నడుస్తున్న ఆటో లోంచి దూకి ప్రాణాలు కాపాడుకుంది

రంగా రెడ్డి జిల్లా: అమంగల్ లో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ధైర్యంతో చేసిన చర్య తనను తాను కాపాడుకుంది. అంతేకాదు.. పోలీసులకు ఇద్దరు క్రిమినల్స్ ను పట్టుకోవడానికి సహాయపడింది.

నార్లకుంట తాండా, కర్తాల్ మండలంలో అమంగల్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి చదువుతుంది మౌనిక (పేరు మార్చడమైనది). ఈ అమ్మయికి గురువారం రోజున ఒంట్లో బాలేదని హాస్టల్ నుంచి ఇంటికి బయలుదేరింది. వార్డెన్ వద్ద అనుమతి తీసుకొని రోడ్డు పైకి వచ్చిన ఆమెకు ఆటో కనపడింది. సాధారణ ఆటో అనుకొని అందులోకి ఎక్కేసింది.

మహమద్ సయీద్ ఆటో నడుపుతుండగా ..ఓమాన్ దేశస్థుడైన హుసేయిన్ మురాద్ అల్-బవుషీ వెనకాల సీటులో కూర్చుని ఉన్నాడు. ఆటో లోకి ఆమె ఎక్కుతూనే, ఆమెపై ఎలా అత్యాచారం చేయాలి అని వారు మాట్లాడుకోసాగారు. అంతే కాక హుసేయిన్ ఆమెను అసభ్యంగా తాకసాగాడు. ఇదంతా ఆటో స్పీడుగా వెళ్తుండగానే జరిగింది.

ప్రమాదాన్ని గ్రహించింది మౌనిక. నిమిషం వృధా చేయకుండా ఆమె ఆటో లోనుంచి దూకేసింది.ఆటోలోంచి దూకిన మౌనికను స్థానికులు కాపాడారు. అంతేకాదు..ఆటోను పట్టుకుని వారికి దేహశుద్ధి చేశారు. వెంటనే అక్కడికి పెట్రోలింగ్ పోలీసులు వచ్చి ఆటోను, ఆది నడిపే వారిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story
Share it