ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు రాశి ఫలాలు
By తోట వంశీ కుమార్ Published on 9 Aug 2020 4:34 AM GMTమేషరాశి :
ఈ రాశివారికి ధనలాభము, మృష్టాన్నముతో భోజనము సర్వసంపదలు కలిగనున్నాయి. రవి చతుర్ధ ఉండడంవల్ల దానికితోడు కుజుడు వ్యయంలో ఉండటం చంద్రుడు ఆయనతో కలవడం ఇవి రెండూ కూడా ఇతనికి ఆదాయం తో కూడిన వ్యయాన్ని ఎక్కువగా చూపిస్తున్నాయి. చంద్రుడు క్రమక్రమంగా ఒక స్థానం నుంచి వేరొకస్థానానికి మారినప్పుడు మంచి ఫలితాలు సూచిస్తుంది. శుక్రునితో కలిసినప్పుడు శత్రుజయం కలుగుతుంది. వారాంతాల్లో వీరికి ధనాదాయం బాగుంది. ఏదైనా వీళ్ళకి శత్రువులు ఇబ్బంది కలిగించే పరిస్థితి. దాని నుండి అయితే బుధుని అత్యధిక ప్రభావం చేత శత్రు నాశనం జరుగుతుంది. వీళ్ళు ఆనందాన్ని అభివృద్దిని పొందగలుగుతారు. మొత్తం మీద ఈ వారం ఒక 48 శాతం వరకూ బాగుంది అని చెప్పొచ్చు. అందులో అశ్విని నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార ఇది బావుంది. భరణి నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది. ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కృత్తిక 1వ పాదం వారికి మాత్రమే నైధన తార అయింది కాబట్టి ప్రతికూల ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
పరిహారం : సుబ్రహ్మణ్యున కు పూజలు చేయించండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి అప్పుడు తొందర తొందరగా మంచి ఫలితం పొందగలుగుతారు.
వృషభ రాశి :
ఈ రాశి వారికి సంపద ధనప్రాప్తి లాభము ఇవి ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. చంద్రుడు వారం మధ్యలో కొంచెం ఇబ్బంది కలిగించినా వారాంతం కల్లా చక్కనైనటువంటి స్థితిని కలిగేల చేస్తాడు. దానికితోడు కుజుడు కూడా ధనప్రాప్తి ఇచ్చే స్థితిలో ఉన్నాడు గనుక కొంతవరకు బాగుంటుంది. అయితే బుధునివల్ల శత్రుపీడ. కుజ శుక్ర శని తప్పనిసరి మీకు అనుకూలంగా ఉన్నారు. అనారోగ్యం ఇంట్లో వయస్సులో పెద్ద వాళ్ళు కానీ చిన్న పిల్లలకు కానీ సూచనలు ఉన్నాయి కాబట్టి వారిని వారి ఆరోగ్యం కంట కనిపెడుతూ ఉండటం చాలా మంచిది. ఒక విలువైన వ్యక్తిని లేదా వస్తువుని పోగొట్టుకునే అవకాశం నెలకొన్నది. ద్వితీయ రాహువు అష్టమ కేతువు మీకు మేలు చేకూర్చడం లేదు. రాహువు కూడా మీకు మాట పట్టింపుతో ఎదుటి వారితో గొడవకు అవకాశమ్ ఉంది. అంచేత మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అంతేకాదు మీకు ఈ వారంలో 42 శాతం మాత్రమే ప్రయోజనం కలుగుతుంది. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కృత్తిక 2 3 4 పాదాలు వారికి నైధన తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు మాత్రమే సాధన తార అయింది పనులు చాలా చక్కగా ఔతాయి. మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మృగశిర 1 2 పాదాలు వారికి ప్రత్యక్తార కాబట్టి అనుకూలత చాలా వ్యతిరేకంగా ఉంది.
పరిహారం : శనివారం నాడు నువ్వులు, నల్ల వస్త్రాలు దానం చేయండి. రాహు కేతువులకు పూజలు చేయించండి.
మిథున రాశి:
ఈ రాశి వారికి ఈ వారం లో లాభము సౌఖ్యము సంతోషం వీటితో శుభారంభం కానున్నది మీకు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అలాగే శని ప్రభావం కూడా మీకు ఎక్కువగా పనిచేస్తుంది రవి శని వల్ల మీరు మానసికంగా శారీరకంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు మీకు చుట్టుప్రక్కల శతృ వర్గాలు పెరిగిపోతారు అనుకోకుండానే స్థితి మీ పై దురభిప్రాయం ఇతరులకు ఏర్పడిపోతుంది. బుధ గ్రహ ప్రభావం చేత మీరు మంచి ఫలితాలనే పొంది మంచి స్థితికి రాగలిగితే, గురు దృష్టి మీకు మంచిని అందజేస్తుంది. మీలో ఇతరులకు మంచిని చేయాలనే గుణం మిత్రులకు మీ పై మంచి అభిప్రాయాన్ని పెంచుతుంది. మీలో దాన గుణం పెరుగుతుంది. మీరు ఎటువంటి శత్రువులైనా మిత్రులుగా మారతారు. మీకు ఈ వారంలో 58 శాతం శుభఫలితాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా మీరు ముందుకు వెళ్లగలుగుతారు మృగశిర 3 4 పాదాలు వారికి ప్రత్యక్ తార అయింది ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి ఆరుద్ర నక్షత్ర జాతకులకు సాధన తార ఫలితాలు దిగ్విజయంగా ఉన్నాయి. పునర్వసు 1 2 3 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి.
పరిహారం: అష్టమ శని ప్రభావం మీపై ఎక్కువగా పనిచేస్తోంది కాబట్టి శనికి నువ్వులు దానము నల్లని వస్త్రముతో నువ్వులనూనె దీపము వెలిగించండి. వీలున్నప్పుడల్లా నల్లని వస్త్రాలు ధారణ చేయండి.
కర్కాటక రాశి :
ఈ రాశివారికి కొద్దిపాటి లాభము ఉత్సాహం వీటితో ధైర్యంతో ముందుకు నడిపే ప్రయత్నం కనిపిస్తోంది. గ్రహముల ప్రతికూలత ఎక్కువగా ఉంది. తాము చేస్తున్న పని నుండి కొంతసేపు దూరంగా ఉండడం లేదా కొద్ది రోజులు ఆ పని నుండి దూరంగా వెళ్లడం గాని జరుగుతుంది. బుధ ప్రభావం చేత అనేక పనులు వాయిదాలు పడుతూ ఉండడమే కాకుండా తాము చేసిన దాని మీద నమ్మకం లేకుండా ఒక సమయంలో అధైర్యపు ఆలోచన కలుగుతాయి . శుక్రుని యొక్క ప్రభావం చేత ఉత్సాహాన్ని తెచ్చుకొని మీరు ముందుకు సాగుతూ ఉంటారు. ఉన్నంతలో హాయిగా ఆనందంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. పేరు ప్రఖ్యాతులకు ప్రయత్నం ఎక్కువ ఫలితం తక్కువ అనే మాట మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. కొంత రహస్యమైన జీవనాన్ని గడపాల్సి వస్తుంది. ఎవరికీ చెప్ప లేని ఇబ్బందిని మీరు ఎదుర్కుంటారు. ఈవారం వీరికి 34 శాతం మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి. పునర్వసు నాలుగో పాదం వారికి విపత్తార అయింది ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పుష్యమి నక్షత్రం జాతకులకు సంపత్ తారైంది ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు జన్మతార అయింది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం గా చెప్పవచ్చు.
పరిహారం : ప్రతిరోజు నవగ్రహ దర్శనం శుభ ఫలితాన్ని ఇస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం గాని హయగ్రీవ స్తోత్రం గాని చేయండి.
సింహరాశి :
ఈ రాశివారికి సౌఖ్యము సంపద విశేష లాభాలు కలిగి ఉన్నత స్థితికి తీసుకొని వెళతాయి.వీరు గొప్ప ఆనందాన్ని అనుభూతిని పొందగలుగుతారు. మంచి విశేషమైనటువంటి విషయాలను వింటారు. శుభకార్యానికి మంచి సమయం కనిపిస్తోంది. ఏదో ఒక గొప్ప విపత్తు మాత్రం ఎదుర్కోక తప్పదు. దాని వల్ల కొంత గౌరవానికి ఇబ్బంది కూడా కనిపిస్తున్నాయి. రవి ప్రభావం చేత వీరు అనవసరమైన విషయాలలో కల్పించుకుని మాట తెచ్చుకునే పరిస్థితి కూడా ఉంది. వారం చివరలో ఆ ఇబ్బందిని మీరు ఎదుర్కొంటారు. కుటుంబ వ్యవహారాల్లోనూ అలాగే సామాజిక వ్యవహారంలోనూ అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. రవి బుధుల వల్ల వీరు చిన్న ఇబ్బందిని ఎదుర్కోక తప్పదు. ఎప్పటినుండో పరిష్కారం కానీ చాలా విషయాలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి. మీ ఆదాయాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు. మఖా నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది. శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పుబ్బ నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది శుభ ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర 1వ పాదం వారికి నైధనతార అయింది. ఫలితాలు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి.
పరిహారం : బుధవారం నియమాలు పాటించండి. రాత్రి నానబెట్టిన పెసలు ఉదయం తెల్లవారి బెల్లం కలిపి ఆవుకి తినిపించండి. సూర్య నమస్కారాలు చేయండి.
కన్యా రాశి :
ఈ రాశి వారికి ఆనందం ధనలాభము సౌఖ్యము కొత్త శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తాయి. ఎన్ని ఉన్నా శ్రమతో కూడిన కార్యక్రమాలు తప్పదు. ఒక ప్రక్క సంతోషాన్ని పొందుతున్నప్పుడు కూడా ఇంకొక ప్రక్క గౌరవానికి ఇబ్బంది కలిగితే ఉంటుంది. ఈ పరిస్థితిని మీరు ఇంకా కొన్నాళ్ళు భరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ వారం లో ఏదైనా మంచి వార్తని వినే అవకాశం లేకపోలేదు. కానీ సంతాన విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఒత్తిళ్లను జయించడానికి మీకు యోగ సాధన ప్రకృతికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేసినట్లయితే మీ ఆలోచనా విధానానికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు అనుకున్నది సాధించడానికి ఇంకా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఈవారం మీకు 42 శాతం మాత్రమే శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉత్తర 2 3 4 పాదాలు వారికి నైధనతార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి అనుకున్నవన్నీ నెరవేరుతాయి. చిత్తా నక్షత్ర 1 2 పాదాలు వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి వ్యతిరిక్త ఫలితాలు ఉన్నాయి.
పరిహారం : గురు స్తోత్ర పారాయణ చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం హయగ్రీవ స్తోత్రం కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. గురువార నియమాలు పాటిస్తే మరీ మంచిది.
తులా రాశి :
ఈ రాశి వారికి కార్య సాధన విశేష ధనలాభము ఆనందానికి అవధులు లేని స్థితికి తీసుకొని వెళతాయి. సర్వసంపదలను కూడా ఒక్కసారిగా పొందగలుగుతారు. సుమారుగా అన్ని గ్రహాలు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో అనారోగ్య సూచనలు ఉన్నాయి. వాటిపై కొంచెం ద్రుష్టి పెట్టి ఉండండి. పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి. మీ కంటే ముందు మీ పనులన్నీ కూడా జరిగిపోతూ మీకు ఎక్కడలేని సంతోషం కలిగిస్తాయి. ఆశ్చర్యమే మీకు కలగొచ్చు కానీ ఈ వారంలో మీరు పొందే ఫలితాన్ని చూసుకుంటే మీరు ఎన్నడూ ఇంత ఆనందాన్ని పొంది ఉండరు. అయితే ఒక అనుకోని విపత్తు రాబోతున్నది. దాన్ని ముందుగా మీరు కనిపెట్టినట్లయితే మీరు దానినుండి బయటపడొచ్చు. అది కొంచెం కనిపెట్టు ఉండండి. దానికి కారణం శని మరియు రాహువు. వీటి ప్రభావం చేతనే ఉదర సంబంధమైన వ్యాధి మీ కుటుంబంలోని స్త్రీలకు కలిగే అవకాశం ఉన్నది. మీరు 58శాతం శుభ ఫలితాలను ఈ వారంలో పొందగలుగుతారు. చిత్తా 3 4 పాదాలు వారికి ప్రత్యక్ తారైంది ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి ఫలితాలు చాలా బాగున్నాయి. విశాఖ 1 2 3 పాదాలు వారికి విపత్తార అయింది ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి.
పరిహారం : శనికి నల్లని వస్త్రము నువ్వులు దానం చేయించండి. రాహువుకి మినుగులు దానం చేయండి. దేవి స్తోత్ర పారాయణ మంచి ఫలితాలను ఇస్తుంది.
వృశ్చిక రాశి :
ఈ రాశి వారికి విశేషంగా ధనలాభము భూలాభము కార్యానుకూలత ఉన్నాయి. వీరికి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి.. అన్నిటికీ భయపడడమే వీరికి వుండే సహజ లక్షణంగా మారిపోతోంది. శత్రు భయము అనారోగ్యము మిమ్మల్ని ఎక్కువగా వెంటాడుతుంది. కార్యములు అనుకున్నవి అనుకున్న కాలంలో నెరవేరక ఇబ్బందులు పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ద్రవ్య నష్టం కూడా ఉంది. దాన్నుంచి మీరు అధిగమించడానికి దైవచింతన కలిగి ఉండటం చాలా అవసరం ఏదైనా విలువైన వస్తువుని పోగొట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు. దానివల్ల మీరు మరింత ఆందోళన పొందుతారు. ఇంట్లో శుభ ఫలితాలు మాత్రం కలిసొస్తాయి. ఎన్నాళ్ల నుంచి ఒక పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. ఈ వారంలో మీకు 42 శాతం మాత్రమే శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. విశాఖ 4వ పాదం వారికి విపత్తార అయింది వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అనూరాధ నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది. శుభ ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జేష్ఠా నక్షత్ర జాతకులకు జన్మతార అయింది అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి.
పరిహారం : నిరంతరం దైవధ్యానం కలిగి ఉండడమే మీ రాశికి చాలా అవసరము. బియ్యం దానం చేయండి. యోగ సాధన లేదా ఆదిత్య హృదయం పారాయణ మీకు మంచి ఫలితాలను ఇస్తాయి.
ధనూరాశి :
ఈ రాశి వారికి ఇష్టమైన పనులు జరిగి కొంత ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ వారం లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక్క బుధుడు తప్ప తతిమ గ్రహాలన్ని కూడా వ్యతిరేకంగానే పని చేస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళు మానసికంగా శారీరకంగా ధైర్యం వహించి ముందుకు సాగాల్సిందే. పూర్వపు అనుభవాన్ని దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా కార్యాన్ని నెరవేర్చటం. స్నేహితులు దైవబలము దగ్గరగా చేసుకొనీ మీ పనులు మీరు నెరవేర్చుకోవడం చాలా అవసరం. మీకంటే ముందు మీకు అపఖ్యాతి గ్రహాల ప్రతికూలత వల్ల వెడుతుంది. దీనికి కారణం మీరు చాలాపనులు వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎంత వీలైతే అంత తొందరగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పూజలు పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేయండి. మీకు ఎదురైన ప్రతి ఒక్కరూ శత్రువులు గాని మారిపోతారు. అలాగే వారు ఏదో ఒక చెడు పని చేస్తారని దృఢ భావం మీలో కూడా కలిగి పోతోంది. ఇది అంతా మంచి పద్ధతి కాదు. అనారోగ్యానికి హేతువుగా ఉంటుంది. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. మీకు భగవంతుని అండ ఉండాలి. మీకు ఈ వారంలో 26 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది ఫలితాలు పర్వాలేదు అనిపిస్తుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రము మిత్ర తార అయ్యింది శుభ ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి నైధనతార అయింది కాబట్టి వ్యతిరిక్త ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి.
పరిహారం : ప్రతిరోజు నవగ్రహ దర్శనం చేయండి. రుద్రాభిషేకం చేయండి చాలా మంచి ఫలితాలను శీఘ్రంగా పొందగలుగుతారు.
మకర రాశి :
ఈ రాశి వారికి ధన లాభం భోగ సౌఖ్యము ఆనందాన్ని కలిగిస్తునప్పటికీ గ్రహస్థితి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. కుజ బుధ అనుకూలం తో మీ పనులు కొంతవరకు నెరవేరుతాయి. గురుడు మీకు ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాడు. శుక్ర శని కేతువులు కూడా మీకు అనుకూల స్థితిలో లేరు. మీలో మీకే వ్యతిరేక భావాలు. మీకు మీరే శత్రువులు గా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాహువు మాత్రమే కొంచెం సుఖ జీవనం యిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు విభేదాలు లేకుండా జాగ్రత్త గా ఉన్నట్లయితే మీ జీవితం సుఖమయం అవుతుంది. కొత్త ప్రయత్నాలు చేసినా ఈ వారంలో సాగే అవకాశాలు లేవు కాబట్టి ప్రయత్నాలను మానుకోవడం మంచిది. అలాగే వ్యాపారం వ్యవసాయం ఇలాంటి పనులకు అవకాశాలు కూడా వస్తాయి కానీ వాటి లోకి ప్రవేశించకండి. ఈ వారం తర్వాత కొంచం అనుకూలతలు కనిపించవచ్చు అంతవరకు జాగ్రత్త వహించడం వ్యక్తిగత బాధ్యతగా మీరు తీసుకోండి. ఈ వారంలో మీకు 42 శాతం మాత్రమే శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు వారికి నైధనతార అయింది పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు మాత్రము సాధన తార అయింది. అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ధనిష్ట 1 2 పాదాలు వారికి ప్రత్యక్ తార అయింది ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పరిహారము: శనికి జపం చేయించండి. నవగ్రహ ప్రదక్షిణ లేదా నవగ్రహ దర్శనం చేయించినా రుద్రాభిషేకం చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి.
కుంభ రాశి :
ఈ రాశి వారికి శత్రు నాశనము ధనలాభము వీళ్ళని ఆనందంలో ముంచెత్తుతూ ఉంటుంది. అటువంటి సమయంలోనే మీకు ప్రతికూలతలు కూడా లేకపోలేదు. కుజుడు ఎదురీతగా పని చేయడంవల్ల ఇంట్లో ఉన్న ధనాదులు కూడా ఖర్చయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. వ్యయమందున్న శని ప్రభావము మీ రాశి పై ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా మీకు వచ్చిన ప్రయోజనాలను కూడా దుర్వినియోగం అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం అనేది మీ యొక్క ముఖ్య లక్షణం గా పెట్టుకోండి. మీకు కుజ ప్రభావం చేత మీ శక్తియుక్తుల్ని వెనక్కు లాగి ఎవరో ఒకరు ఎదురు తిరిగే వాళ్ళు ఉంటూనే ఉంటారు తద్వారా మీరు మానసిక ఆందోళనకు గురై దాని ద్వారా మీరు ఇబ్బందులు ఎదుర్కొనే ఒత్తిడి కలుగుతుంది. ఇలాంటివన్నీ అధిగమించాలంటే ముఖ్యంగా గురు ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీకు ఉపదేశమైన మంత్రాన్ని పఠించండి. మీకు ఈ వారంలో 50 శాతం మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి. ధనిష్ట 3 4 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. శతభిషా నక్షత్ర జాతకులకు మాత్రము క్షేమతార అయింది కాబట్టి అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి విపత్తార అయింది. అనుకూల తక్కువగా ఉంది.
పరిహారం : శని గ్రహానికి పూజలు చేయించడం రుద్రాభిషేకము చాలా మంచిది. గురుచరిత్ర పారాయణ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ హయగ్రీవ స్తోత్రం పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.
మీన రాశి :
ఈ రాశి వారికి ధన లాభం స్త్రీ సౌఖ్యమ్ విశేషమైనటువంటివి ఫలితాలుగా పొందుతున్నారు. రవి ప్రతికూల చేత ధైర్యం చంద్రుని ప్రభావం చేత విజ్ఞత తగ్గుతున్నది. కుజ బుధులు దానికితోడు గురుడు కూడా మీకు వ్యతిరేక భావాలనే ఇస్తున్నారు దాని వల్ల మీరు ధైర్యం సన్నగిల్లి ఇంకా ఇంకా వెనక్కి పోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిదానికి ఒక నిరాశ నిస్పృహ అలాగే జీవితం అంటే భయం వంటివి ఉన్నాయి. అలాంటి స్థితి నుంచి మీరు బయటికి రావడానికి గురు అనుగ్రహము చాలా అవసరం. కుటుంబ సభ్యులతో తప్ప అన్యుల దగ్గర మీరు సలహాలు సంప్రదింపులు తీసుకోవడానికి అనుకూలంగా లేదు. మీ పనులన్నీ కూడా వాయిదా వేయడమే చాలా మంచిది. కొద్దిరోజుల పాటు మీరు మరుగు పరచు కోవడం వల్ల లాభం పొందుతారు. మీరు సాహసంగా వెళ్ళినట్లయితే దుష్ఫలితాలతో పాటు గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ వారంలో 36 శాతం మాత్రమే మంచి ఫలితాలు పొందగలుగుతున్నారు. పూర్వాభాద్ర 4 వ పాదం వారికి విపత్తార అయింది కాబట్టి ప్రతికూలత ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది కాబట్టి అనుకూల పరిస్థితి ఎక్కువగా ఉన్నాయి. రేవతీ నక్షత్ర జాతకులకు జన్మతార అయింది కాబట్టి అనారోగ్య సూచనలు ఉన్నాయి.
పరిహారము : నవగ్రహాలకు పూజలు చేయించండి రుద్రాభిషేకము మంచిది. 12వ తేదీన కృష్ణాష్టమి విష్ణు సహస్రనామ పారాయణ, 15వ తేదీ ఏకాదశి నియమం పాటిస్తే మంచిది.