బ్రిటన్‌లో చైనా యువతిపై దాడి

By అంజి  Published on  25 Feb 2020 3:30 AM GMT
బ్రిటన్‌లో చైనా యువతిపై దాడి

కరోనా వ్యాధి భయానికి ఒక యువకుడు పిచ్చిగా ప్రవర్తించాడు. తన పుట్టినరోజు వేడుకలకు చైనాకు చెందిన ఒక స్నేహితురాలిని ఆహ్వానించినందుకు గానూ ఒక భారతీయ సంతతికి చెందిన యువతిపై ఆమె స్నేహితుడే దాడి చేసిన సంఘటన బ్రిటన్ లో చోటు చేసుకుంది.

సోలిహల్‌ టౌన్‌లోని తన ఇంటిలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న మీరా సోలంకి లండన్ లో ఉంటున్న చైనాకు చెందిన తన మిత్రురాలు మండి హువాంగ్‌ తో సహా ఇతర మిత్రులను కార్యక్రమానికి ఆహ్వానించినపుడు ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. మండీ ఆ ఇంటిలోకి ప్రవేశించిన వెంటనే అక్కడికి వచ్చిన ఆసియా సంతతికి చెందిన ఒక స్నేహితుడు కరోనా వైరస్‌ ఉన్న వారిని వెంటనే వెనక్కి పంపేయమంటూ దాడి చేశాడని, అతనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మీరా తలకు బలమైన గాయం కావడం తో కొద్దిసేపు కోమా లోకి వెళ్లి పోయిందని, కొందరు సన్నిహితులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలింగా ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని స్థానిక మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించింది. ఈ ఘటనపై వెస్ట్‌మిడ్లాండ్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం.

Attack on Chinese woman

Next Story