స్పెయిన్‌లో దారుణం.. సైన్యం కంటపడిన ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

By Newsmeter.Network  Published on  25 March 2020 3:40 AM GMT
స్పెయిన్‌లో దారుణం.. సైన్యం కంటపడిన ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో పురుడుపోసుకున్న ఈ వైరస్‌ ప్రపంచ దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ భారిన పడి వేలాది మంది మృత్యువాత పడుతుండగా.. లక్షల మంది ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ భారిన పడిన వారి సంఖ్య నాలుగు లక్షలకు చేరువవ్వగా.. 18,299 మంది మృత్యువాత పడ్డారు. ఇటలీలో అత్యధికంగా 6,820 మంది, చైనాలో 3,277 మంది, స్పెయిన్‌లో 2,800 మంది, ఇరాన్‌లో 1,934 మంది, ఫ్రాన్స్‌లో 860, అమెరికాలో 622, యూకేలో 422 మంది, నెదర్లాండ్‌లో 275, స్విజర్లాండ్‌లో 122, ఇండోనేషియాలో 55 మంది, జపాన్‌లో 43 మంది, భారత్‌లో 11మంది మృత్యువాత పడ్డారు. వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆయా దేశాల్లో లాక్‌ డౌన్‌ విధించారు.

Also Read : దేశంలో 11కు చేరిన కరోనా మృతుల సంఖ్య

ఇదిలా ఉంటే ఈ వైరస్‌ ప్రభావం చైనా తరువాత.. ఇటలీ, స్పెయిన్‌ దేశాలపై తీవ్రంగా ప్రభావం చూపినట్లు కనిపిస్తుంది. ఇటలీలో ఈ వైరస్‌ భారిన పడి 6వేలకు పైగా మంది మృత్యువాత పడటంతో ఆ దేశంలో పరిస్థితి దయనీయంగా మారింది. వైరస్‌ సోకి చికిత్స పొందేందుకు ప్రజలు భారీగా ఆస్పత్రులకు వస్తుండటంతో.. అందరికి వైద్య సేవలు అందించే పరిస్థితి లేక వృద్ధులను పక్కన పెడుతున్నట్లు ప్రచారంలో ఉంది. ఇదే విధంగా స్పెయిన్‌లో పరిస్థితి దారుణంగా కనిపిస్తుంది.

Also Read :అర్థం చేసుకోండి.. యుద్ధం సమయంలో కూడా రైలు ఆగలేదు

స్పెయిన్‌లో ఇప్పటికే కరోనా వైరస్‌ భారిన పడి 2,800 మంది మృతిచెందారు. ఈ దేశ రాజధాని మాడ్రిడ్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి భారిన పడిన వృద్ధులను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారంట. దీంతో వారు చివరకు కరోనాతో కుంగి కుంగి చనిపోతున్నారు. కొందరు జీవచ్చవాలుగా మిగిలిపోతున్నారు. స్పెయిన్‌లో వైరస్‌ గురైన వృద్ధులను రిటైర్మెంట్‌ హోంలలో ఉంచారు. వీటిని డిస్‌న్పెక్ట్‌ చేసే బాధ్యత చేపట్టిన సైన్యానికి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు కనిపించాయి. పట్టించుకునే వారు లేక చాలా హోంలలో డజన్ల కొద్దీ వృద్ధులు చికిత్స పొందుతున్న మంచాలపైనే ప్రాణాలొదిలారు. మరికొందరు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు ప్రాణమున్నా జీవచ్చవాలుగా పడి ఉండటాన్ని చూసి సైన్యమే చలించిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వృద్ధుల చికిత్సలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

Next Story