అనంతపురం : వైసీపీ విస్తృతస్థాయి సమావేశం రసాభాసగా మారింది. తమను పట్టించుకోవడం లేదంటూ కార్యకర్తలు మంత్రి బొత్స సత్యనారాయణ ముందే గొడవకు దిగారు. కార్యకర్తల ఆందోళనతో విస్తృతస్థాయి సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఈ గంద‌ర గోళంలో సభా వేదిక పై వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు నారాయణ రెడ్డి చెంపను కోగటం విజయ భాస్కర్ రెడ్డి అనుచరుడు, వైసీపీ కార్యకర్త చెళ్లుమనిపించాడు. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్ప‌డింది.

మంత్రి బొత్స క‌ల్పించుకుని కార్య‌క‌ర్త‌ల‌కు సర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో కాసేపు స‌భకు అంత‌రాయం క‌లిగింది. ఇదిలా ఉంటే.. స్ధానిక సంస్థల ఎన్నికలపై నేతలతో బొత్స చర్చించారు. ఎన్నికలకు సిద్ధం కావాలని నేత‌ల‌ను ఆదేశించారు. రాయలసీమలో కరువు ఉండకూడదన్న ప్రణాళికతో పని చేస్తున్నానమని తెలిపారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.