చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం..36 మంది మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2019 6:57 AM GMT
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం..36 మంది మృతి

బీజింగ్‌: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశంలోని తూర్పు జియాంగ్సూ ప్రావిన్సులో బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 36 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 36 మంది తీవ్ర గాయాలపాలైనట్లు బీజింగ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ అధికారులు ఆదివారం తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామని, వీరిలో మరో 20 పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్నారు. బస్సు ఎడమ టైరులో గాలి తగ్గడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. చాంగ్‌చున్‌-షెంజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డులో ఈ ప్రమాదంతో ఎనిమిది గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ మధ్య కాలంలో అక్కడి ఎక్స్‌ప్రెస్‌ రోడ్లపై భారీగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

Next Story