యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం అశ్వద్ధామ. ఈ సినిమాని ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మించారు. నూతన దర్శకుడు ర‌మ‌ణ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగ శౌర్య సరసన మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. రీసెంట్‌గా విడుద‌లైన నిన్నే నిన్నే సాంగ్‌, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ రెస్పాన్స్‌తో మ‌రింత ఉత్సాహాంగా నాగ‌శౌర్య డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. యథార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకి హీరో నాగ‌శౌర్య క‌థ‌ను రాయడం విశేషం. కేవ‌లం యాక్ష‌న్ ఎలిమెంట్సే కాదు.. మంచి మెసేజ్ ఉన్న చిత్రంగా సినిమాను రూపొందిస్తున్నారు. నాగ‌శౌర్య డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి జ‌న‌వ‌రి 31న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా పై నాగ శౌర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు.

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగ శౌర్య ఫలానా అబ్బాయ్ – ఫలానా అమ్మాయ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి మరీ ఈ సినిమా చేసాడు. కెరీర్ ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడేలా భారీ విజయాన్ని అందిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు. మరి.. నాగ శౌర్యకి అశ్వద్ధామ ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort