గోదా గోవింద గీతం : యాదవకులరత్న దీపకుండు, గోపాలవీర యదు నందనుండు
Yadavakularatna Deepakundu Gopalavira Yadu Nandanundu.మాయనై మన్ను వడమదురై మైందనై
By M Sridhar Published on 20 Dec 2022 2:07 AM GMTమాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్
భావార్థ గీతిక
మాయల అంతర్యామి ఉత్తర మధురలో కృష్ణుడై పుట్టినట్టి
దేవకీ వసుదేవ పూర్వపున్నములు నిండిన పసిడి పంట,
మలయానిలముల తిరిగి సోలెడు యమునా విహారి వేణుధరుడు
యాదవకులరత్న దీపకుండు, గోపాలవీర యదు నందనుండు
యశోద గోరుముద్దలగోరు నవనీతచోరు విష్ణుమూర్తి
రాగరంజితమనోసుమాల నర్చించ పునీతమై వచ్చినాము
చీకట్లు తొలగించు కృష్ణలీల, కట్లు తెంచు కృష్ణ ధ్యానము
పాపాల దూదిరాశిని బూదిచేయుకృష్ణనామమే మాకు శరణు
గోదాదేవి అయిదో పాశురంలో చెప్పిన భగవదనుగ్రహ ప్రాధాన్యత, అన్నమయ్య కీర్తన అంతర్యామిలో అక్షరక్షరంలో కనిపిస్తుంది.
అర్థం : మాయనై = ఆశ్చర్యకరమైన, మన్ను = ఎల్లప్పుడు భగవత్సంబంధము గలవాడైన, పెరునీర్ = మహాజలప్రవాహముగల, యమునైత్తుఱైవనై= యమునానదీ వడమదురై మైందనై =ఉత్తరమధురానగర నాయకుడైన, తూయ =పరిశుధ్ధ తీరమున ఉండే వాడు, ఆయర్ కులత్తినిల్ = గోపవంశంలో, తోన్ఱుం =ప్రకాశించిన, మణి విళక్కై= మణిదీపమైన వాడిని, తాయై క్కుడల్ = తల్లి యశోద కడుపున, విళక్కం శెయ్ద =ప్రకాశంపచేసిన, దామోదరనై= దామోదరుని, తూయోమాయ్ =పరిశుద్ధులమై, వందు = వచ్చి, నాం తూ =పవిత్రమైన, మలర్ =పూలను, తూవి = అక్రమముగా విసిరి, త్తొళుదు =సేవించి, వాయినాల్ పాడి = నోటితో పాడి, మనత్తినాల్ = మనస్సుతో, శిందిక్క=చింతించి, ధ్యానము చేసి, పోయ పిళైయుం = ముందటి పాపములున్నూ, పుగుదురువాన్ నిన్ఱనవుం =మునుముందు రాబోయే పాపములను, తీయనిల్ = నిప్పులో, తూశాగుం = దూదిగా కాలిపోతుంది శేప్పే= పరమాత్ముడిని నామాములను కీర్తించే, లోర్ ఎమ్బావాయ్= మావ్రతము.
- మాడభూషి శ్రీధర్