గోదా గోవిందగీతం : ఆకాశానికెదిగి లోకాలనెల్ల పాదాల కొలిచినాడు

Goda Govinda Geetham 3.ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి

By M Sridhar  Published on  18 Dec 2022 1:52 AM GMT
గోదా గోవిందగీతం : ఆకాశానికెదిగి లోకాలనెల్ల పాదాల కొలిచినాడు

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి

నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్

తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు

ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ

పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప

తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి

వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్

నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్

నమ్మిన వారికోసం మరుగుజ్జుగా మారినవాడు

అంతలోనే పెరిగి అంతరిక్షాలు తాకి లోకాల కొలిచినాడు

ఆతని కొనియాడి, ఉదయాన స్నానమాడి


భావార్థ గీతిక

మనసున నమ్మిన వారి గావ మరుగుజ్జుగా దిగి వచ్చినాడు

అంతలోనె ఆకాశానికెదిగి లోకాలనెల్ల పాదాల కొలిచినాడు

నోముస్నానాల పునీతమై త్రివిక్రముని నోరార వేడుదాము

నెలమూడు వానల, వెన్నెల సోనల వ్రేపల్లె సస్యశ్యామలంబు

ఎదిగిన పైరుల నిండిన జలాల త్రుళ్లి పడు మీన సంచయంబు

తెలుపుకలువపూల తెలవారుదాక నిదిరుంచు తుమ్మెదలు

కృష్ణువేణువు తాకి సేపులెగసి గోవులిచ్చును క్షీర కుంభవృష్ఠి

సిరిసంపదలకేమి కొదవ రారండి సిరినోము జేయ సీమంతులార.


శరీరమనే క్షేత్రంలో జీవుడనే విత్తనాన్ని పరమాత్ముడు నాటుతాడు. ఆత్మసస్యం ఫలించాలంటే ఈతి బాధలు ఉండరాదు. నెలమూడు వానలు కురియాలి

అర్థం : ఓంగి =సమున్నతంగా పెరిగి, ఉలగు = మూడులోకాలను, అళంద = కొలిచిన, ఉత్తమన్ =పురుషోత్తముడైన పరంధాముని, పేర్ = తిరునామాలను, నాంగళ్ =మేము, పాడి= స్తుతిస్తూ, నం పావైక్కు చ్చాత్తి = వ్రతం నెపంమీద, నీర్ ఆడినాల్ =స్నానం చేస్తే, తీంగిన్ఱి = ఈతిబాధలేవీ లేకుండా, నాడేల్లాం = దేశమంతటా, తింగళ్ =నెలకు, ముమ్మారి పెయ్దు=మూడు వానలు కురుస్తాయి, ఓంగు పెఱుం జెన్నెలూడు =బాగాపెరిగి ఎరుపు రంగులో ఉన్నధాన్యపు గింజలు వేలాడే వరిపొలాల మధ్యలో, కయల్ ఉగళ= చేపలు తుళ్లిపడుతూ ఉంటే, పూంగువళై ప్పోదిల్ = సుందరమైన కలువ పూవులలో, పోఱివండు = అందమైన తుమ్మెదలు, కణ్-పడుప్ప= నిద్రిస్తూ ఉంటే, తేంగాదే = సంకోచం లేకుండా, పుక్కు = పాలుపిండడానికి, ప్రవేశించి, ఇరుందు= స్థిరంగా ఉండి, శీర్ త్త ములై = నిండిన పొదుగులను, పత్తి(ట్రి) =పట్టుకుని, వాంగ= పిండగా, క్కుడం నిఱైక్కుం= కుండలునిండిపోతున్నాయి, వళ్ళల్ = ఉదారంగా, పెరుం పశుక్కళ్= పెద్దగా పెరిగిన పశువులను, నీంగాద శెల్వం =ఈ విధమైన అక్షయమైన సంపద నిఱైందు = నిండి ఉంటుంది.

Next Story