రాశి ఫలాలు డిసెంబర్ 29 నుంచి జనవరి 4 వరకు

By Newsmeter.Network  Published on  29 Dec 2019 6:50 AM GMT
రాశి ఫలాలు డిసెంబర్ 29 నుంచి జనవరి 4 వరకు

మేష రాశి :

ఈ రాశివారికి లగ్నాధిపతి కుజుడు. అష్టమం స్వక్షేత్రం కనుక లగ్నం కూడా తనదే గనుక చాలా మేలు చేయనున్నాడు. అంతేకాదు నవమ ఆధిపత్యం వచ్చిన గురుడు అతని పంచమ దృష్టి ఈ వారం వీరి జాతకాన్ని అత్యంత శుభప్రదంగా నడిపిస్తాయి. వివాహ ప్రయత్నాలు జరుగుతాయి నెరవేరుతాయి. అన్ని విధాలా కలిసివస్తాయి. రవి గురుల కలయిక కూడా వీరికి కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెడతాయి. స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు వ్యవహారాలు లౌకిక తగువులలోను లబ్దిని పొందగలరు. ఉద్యోగ అవకాశాలు చివరిలో చేజారిపోవచ్చు. గట్టి ప్రయత్నం చేయండి. అశ్విని వారికి శుభఫలితాలు ఎక్కువ. భరణి వారికి విపత్తారతో ప్రారంభం గాన వ్యతిరిక్త ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.కృత్తిక ఒకటో పాదం వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది.

పరిహారం : మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయండి. కుజుడికి కందులు దానం చేయండి. ఎర్రని వస్త్రం ధరించితే శుభప్రదము. ఆంజనేయస్వామిని దర్శించండి.

వృషభ రాశి :

ఈ రాశివారికి లగ్నాధిపతి ఋణాధిపతి కూడా శుక్రుడే అయినా తప్పనిసరిగా మేలు చేస్తాడు.అష్టమాధిపతి కూడా సహకరించి పలు సమస్యలకు పరిష్కారాలు ఇస్తాడు. వివాహ ఆటంకాలు దాంపత్య ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార వ్యవహార దక్షత పెరుగుతుంది. మాట ప్రల్లదనం వల్ల మంచి అవకాశం పోగొట్టుకుంటారు. మానసిక ఆందోళనలు ఉంటాయి. మూడో స్థానం అధిపతి రవి, చంద్రుడు కూడా నేత్ర రోగాలు ఇవ్వనున్నారు. ఎందుకైనా మంచిది శిరోవేదన రాగానే వైద్యులను సంప్రదించండి. గుండె సంబంధ వ్యాధి ఉన్నట్లయితే ముందు జాగ్రత్త చాలా అవసరం. అధిమిత్ర గ్రహాల వల్ల కొంచెం ఒత్తిడులు తగ్గుతాయి. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు వారికి శుభ పరంపరలు కొనసాగుతాయి. రోహిణి వారికి శిరోవేదన. మృగశిర ఒకటి రెండు పాదాలు వారికి మిశ్రమ ఫలితం .

పరిహారం : గురువారం నియమంతో పాటు శనగలు దానం చేయండి. తెల్లని వస్త్ర ధారణ మంచిది. బిల్వాష్టకం పఠిస్తే మంచి ఫలితం వస్తుంది.

మిధున రాశి :

ఈ రాశ్యాధిపతి సముడైన గురుని ఇంట్లో ఉంటూ వీక్షించడం వల్ల శుభం కలుగుతుంది. కేంద్రాధిపత్య గల గురుని దృష్టి ఆ భావాలను చెడి గోడుతోందనే చెప్పాలి. సప్తమంలో ఉన్న గ్రహాలు మీకున్న బలాలు బలగాలను వెనక్కు లాగుతున్నాయి. మానసిక దుర్బలత్వం మీలో చోటు చేసుకుంది. శుక్రుడు యోగిస్తాడు కానీ మీకు స్త్రీ మూలక ధన వ్యయము లేదా అవమానం తప్పదు. ఎంత మంచిగా ఉందామనుకున్న మీ గతం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఏదో ఒక మంచి వార్త మీకు ఉపశమనం కలిగించొచ్చు. ఆధిక్యం చూపిన వారి దగ్గర న్యాయశాస్త్ర విషయాల్లోనూ వెనక్కి తగ్గి ఉండండి. వాదోపవాదాలు మీకు మేలు చేకూర్చవు మృగశిర మధ్యమ ఫలితం. ఆర్ద్ర వారికి శుభాశుభ మిశ్రమం. పునర్వసు ఒకటి రెండు పాదాల వారికి నైధన తారతో వార ప్రారంభం కనుక శుభ ఫలితాలు మృగ్యం.

పరిహారం : దక్షిణామూర్తి స్తోత్రం చదవండి శివునకు అభిషేకం లేదా శివతాండవ స్తుతి పారాయణ శుభప్రదం. ఉదయమే లేచి సూర్యునికి నమస్కరించండి .

కర్కాటకరాశి :

ఈ రాశి వారికి శుభ పరంపరలు పెరగనున్నది ఆశలు మళ్లీ చిగురిస్తాయి. ఈ రాశివారు ఏదో ఒక శుభ ఫలితాన్ని పొందగలరు. రవి మాత్రం తాపాన్ని కలుగ చేయనున్నాడు. గత అనుభవాలు మీ వృత్తి వ్యాపారాల ఉన్నతికి దోహదపడతాయి. మీ అదృష్టం మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తుంది. దాన్ని గుర్తించండి. అవకాశం చేజార నివ్వకండి. మీ కోసమే అన్నట్లు ఒక వ్యక్తి లేదా ఉద్యోగం రావచ్చు. మిమ్మల్ని చూసి ఈర్ష్య పడేవారే ఉన్నారు వారిని ఒక కంట కనిపెట్టండి. ఒక మెట్టు దిగితే మీ పని మరింత సులువు అవుతుంది. మంచి సావాసాలు లేదా జీవిత భాగస్వామి వ్యాపార భాగ స్వామి లభిస్తారు. పెద్దలను తల్లిదండ్రులను విస్మరించకండి. కన్న తల్లి ఆరోగ్యాన్ని ఒక్కసారి పరీక్షించండి. పునర్వసు నాలుగవ పాదం వారికి నైధన తారగాన ప్రయోజనం తక్కువ. పుష్యమి వారికి సాధన కాబట్టి కార్యసాధన స్థాయి పెరగనున్నది. ఆశ్లేష వారికి ప్రత్యక్ తార గావున శుభాశుభ మిశ్రమం.

పరిహారం : బుధవారం నియమం పాటించండి. నానబెట్టిన పెసలు ఉదయాన్నే ఆవుకు తినిపించండి వ్యాపారాభివృద్ధి ఉంటుంది. అమ్మ వారిని నమ్మి పూజించండి మీ జీవితం బాగుంటుంది.

సింహ రాశి :

ఈ రాశివారికి శుభ పరంపరలో వెనుకబాటుతనం ఒక్కసారిగా ఎదురు కానున్నది. మీ ఆరోగ్యం బావుంటుంది. మీ తల్లి కు మానసికంగా ఇబ్బంది ఎదుర్కోనున్నది గ్రహించండి. గృహ విషయంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంటివాతావరణాన్ని పరిశీలనగా చూడండి. వాస్తు లోపాలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయనున్నాయి. మీ పరాభవాన్ని కోరుకునే వారే మీ చుట్టు పక్కల ఉన్నారు. అది గుర్తిస్తే మేలు. త్రిషడాయ అధిపతులైన కుజ బుధులు మీకు ప్రతి పనిలోనూ ఆటంకాలు కలుగ జేసే స్థితిని తెలియజేస్తున్నారు. మీలో ఉత్సాహం తగ్గుతుంది. సింహం లాంటి మీరు మీ ఆలోచనలకు ఉపసంహారం పలకాల్సి వస్తోంది. ఆవేశం తగ్గించండి ఆలోచనలతో అడుగేయండి. గుడ్డిగా దేనినీ ఎవరినీ నమ్మవద్దు. మఖ నక్షత్రం వారికి క్షేమ తారతో వారు ప్రారంభం గనక శుభం. పుబ్బవారికి విపత్తార గావున ఆచితూచి అడుగేయడం మంచిదని సూచన. ఉత్తర ఒకటో పాదం వారికి ఆర్థిక లాభం ఉంది. పరిహారం : సూర్యనమస్కారాలు శనివారము విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

కన్యా రాశి :

కన్యాలగ్నం వారికి ఆధిపత్య పాపులు ఎక్కువయ్యారు. అంతేకాదు పాపులతో కూడిన బుధుడు కూడా అసహాయ స్థితిలో కనిపిస్తాడు. ఆలోచన చేస్తే అవకాశం తక్కువ. గుడ్డిగా వెళితే ఎదురీత. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది. నాలుగో స్థానంలో ఉన్న తాత్కాలిక మిత్రగ్రహాల వారిని మీరు జప తప హోమాదుల తో సంతృప్తం చేస్తే విజయం తప్పక పొందగలరు. వీరిది సమస్యాత్మక కాలంగా చెప్పవచ్చు. శారీరక దారుడ్యం తగ్గి మానసిక ఒత్తిడి పెరుగుతుంది . ఓ ప్రక్క అర్ధాష్టమ శని పరీక్షాకాలం .ప్రతిదానిని మీరు సవాల్గా తీసుకోవాలి. మీ వెనుకనున్న వారు మీ వల్లే లాభం పొందాలనుకున్నారు. మీకు భగవంతుడు ఒక్కఢే సహకరించ గలడు. ఆత్మావలోకనం చేయండి. మిమ్మల్ని మీ పరిస్థితిని గ్రహిస్తే మీ సమస్య చిన్నదిగా తెలుస్తుంది. పిల్లల వల్ల మాత్రమే మనశ్శాంతి. భాగస్వామి మీకు వ్యతిరేకి రచ్చ మాత్రం గెలవగలరు. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి ఆర్థిక లాభం ఉంది. వాస్తవారికి శరీర తాపం. ఆందోళన. చిత్త ఒకటి రెండు పాదాలు వారికి శుభాశుభ మిశ్రమం.

పరిహారం : అశ్వత్థ ప్రదక్షిణం చేయండి. సప్తశతిలోని దుర్గా సప్త శ్లోకీ పఠించండి. మంచి ఫలితం ఉంటుంది.

తులా రాశి :

ఈ రాశి వారికి రెండు మూడు నాలుగు స్థానాల్లో ఉన్న తాత్కాలిక మిత్రులు విశేష లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంది. మీరు మంచి ఫలితాన్ని చవి చూడనున్నారు. ద్వితీయ సప్తమ మారక స్థానాధిపతి కుజుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల దీర్ఘ వ్యాధులున్న వారు దుష్ట సహవాసం ఉన్నవారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సివస్తోంది. వీరికి శని బుధ శుక్రులుయోగ కారకులై మేలు చేయనున్నారు. శరీరంలో కుడి భాగంలో ఆకస్మిక ప్రమాద సూచనలు ఉన్నాయి. వాహనాలను నడిపే వారు జాగ్రత్త వహించండి. శని ప్రథమ యోగ కారకుడు అయి వుండడం వల్ల మీకు సమత్వం అబ్బి మంచి జరిగే అవకాశం ఉంది. మీరు ఆకస్మికంగా ఏదన్నా పొందాలి తప్ప గ్రహస్థితి వల్ల పొందే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఏమైనా కుటుంబంతో సత్సంబంధాలు దూరమవుతాయి అన్నదమ్ములు బాగుంటారు వారిని చూసి ఈర్ష్య పడి ప్రయోజనం లేదు. మీ స్థాయిని మీరు పెంచుకోవడమే మంచిది.చిత్రం మూడు నాలుగు పాదాలు వారికి సృహ ఫలితాలు కలుగనున్నాయి స్వాతి వారికి ఎదురు చూడని లాభం నుండి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారికి నిజాలతో వారు ప్రారంభంగానే ఫలితాలు తక్కువగా ఉన్నాయి.

పరిహారం : శుక్రునకు సంబంధించి అమ్మవారిని లేదా సుబ్రహ్మణ్యాన్ని పూజించండి. మంగళవారం నాడు ఆంజనేయస్వామికి గారెల దండ లేదా నిమ్మకాయల దండ వేయండి

వృశ్చిక రాశి :

ఈ రాశివారికి లగ్నాధిపతి కుజుడు మేలు చేయనున్నాడు గురు పూజ చంద్ర రఘులు యోగ కారకులే ఉన్నారు గాని మం మంచి ఫలితాలను పొందే పొందుతారు చక్రవర్తి సేనలు బాబు లవుడు మూలానా కత్త కళత్రం తోనూ సమాజంతోనూ వ్యతిరేకించాల్సి వస్తుంది చేస్తున్న పనిలో ప్రోత్సాహం ఎంతో ఉంటుందో నిరుత్సాహం కూడా అంతే ఉంటుంది వీరికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి అయితే భగవత్ కృపతో పూరి సాధన వల్ల మంచి స్నేహితుల వల్ల చక్కని లాభాన్ని పొందుతారు వీరు ఇతర పూర్వం చేసిన పూజలు సమాజ సేవ అక్కరకు వస్తాయి వీరిని నమ్మిన వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు వారి బాధ్యతలను మీరు నెత్తిన వేసుకోవడం వల్ల కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు శుక్ర బుధ శనులు కాపులు అంతేకాదు వీడనున్న ఏల్నాటి శని ఏదో ఒక ఇబ్బందిని ఒక మేలును చేయబోతోంది విశాఖ నాలుగో భాగం వారికి పిలిచి కాల్చుకు అనూరాధ వారికి సాధన సారిగా వున్న పనులు నెమ్మదిగా పూర్తి అవుతాయి మేష్టారికి ప్రస్తుత కారు గావున ఆందోళన మనస్తాపం తప్పదు పరిహారం: శివుణ్ని ఆరాధించండి కనీసం కేశవనామాలు స్మరించినా మీకు మేలే జరుగుతుంది. తులసి మాలలతో శ్రీరాముణ్ని అర్చించండి .

ధనుస్సు రాశి :

ఈ రాశివారికి రాశ్యాధిపతి గురుడు లగ్నంలో ఉండటం వల్ల వీరికి రవి చంద్ర కుజులు మేలు చేయనున్నారు. వీళ్ళల్లో పరివర్తన అనేది వస్తుంది. విష్ణును పూజించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కావున మీ సమస్యలు నిదానంగా పరిష్కరింపబడతాయి. మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏల్నాటి శని ప్రభావం ఉన్నప్పటికీ తాత్కాలికంగా అది మీకు కనిపించదు. ఈ వారంలో వాహనాల్లో విహార యాత్రలు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ రాశి వారికి చిన్న చిన్న అనారోగ్యాలు కనిపించే అవకాశం ఉంది. శని బుధ శుక్రులు పాపులు గావున దుష్థ సావాసం వ్యాపారాల్లో నష్టం కర్తతో విరోధం ఈ మూడు ఒకేసారి చవిచూస్తారు. ఏది ఏమైనా ఈ వారం మీకు శుభాశుభ మిశ్రమంతో పాటు ఒక మంచి జరిగే అవకాశం ఉంది. మూలానక్షత్రం వారికి కార్యసాధనకు అనుకున్నది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. పూర్వాషాఢ వారికి అనుకూలతలు తక్కువ ఉన్నప్పటికీ ఏదో మంచి చవి చూస్తారు. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి ఎప్పుడో పడిన కష్టానికి మంచి పలితం పొందుతారు.

పరిహారం : శనికి తైలాభిషేకం చాలా మంచిది. అలా కానపుడు శివుని గురువుగ భావించండి సత్ఫలితాలు పొందుతారు .

మకర రాశి :

ఈ రాశివారికి ఆధిపత్య శుభులు బాగానే మేలు చేస్తారు. ఏటికి ఎదురీత పోయి ఈ వారాల్లో మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ వారాల్లో మీపై ఏళ్ల నాటి శని ప్రభావం కనిపించదు. మీకు గృహాధి పత్యం ఉంది. చర స్థిర ఆస్తుల తగాదాలు తీరవు. అన్నదమ్ములతో వ్యవహారం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తాత్కాలిక మిత్రులు ఐన ఐదు గ్రహాల ప్రయోజనం మీకు ఏదో ఒక మంచిని సూచిస్తోంది. ఉద్యోగ వ్యాపార ధనాది లాభాలు కలగవచ్చు. ఈ వారంలో వివాహ ప్రయత్నం చెయ్యండి. కొంచెం ముందుకు వెళితే ప్రయోజనం ఉండొచ్చు. శుక్రుడు దగ్గరలో ఉండటం వల్ల మీరు అనుకున్న పనులు జరిగే అవకాశం ఉంది ఉత్తరాషాఢ వారికి శుభ ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయ శ్రవణం వారికి జన్మతార గాన అనారోగ్యం సూచిస్తోంది. ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు వారికి మిశ్రమ ఫలితం ఉంది .

పరిహారం : శనికి తైల తైలాభిషేకం నువ్వులు దానము నల్లని వస్త్రం దానం చేయడం మంచిది. గోపూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది

కుంభ రాశి :

ఈ రాశివారికి ఈ వారం సాధారణంగా సాగిపోతుంది. ఏలినాటి శని ప్రభావం కొద్దికొద్దిగా మీపై పాకుతోంది. ఈ విషయంలో ముందుగానే జాగ్రత్తపడండి. గృహ వ్యవహారాలు ప్రేమ వ్యవహారాలు ఉంటే వాట్లోంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయండి. మీకు గురుబలం చాలా తక్కువగా ఉంది. మీకు గురుడు ద్వితీయ అధిపతి అవడం వల్ల ప్రతి పనికి ఆటంకం కలిగిస్తాడు. ఒకటి అయిదు తొమ్మిది అధిపతులైన శని బుధ శుక్రుడు మీ పనులను శులభతరం చేసే అవకాశాలు కలిగి ఉన్నారు. మీ ఆత్మస్థైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పెట్టుబడికి తగిన లాభాన్ని మించిన లాభాన్ని పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నం కూడా కొంతవరకు శుభ సూచనలు ఇస్తుంది. మంచి రోజులకు మంచివాళ్లకు వచ్చినట్లే అనుకోవచ్చు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు వారికి శుభాశుభ మిశ్రమం కాగా శతభిషం వారికి ఈ వారంలో చాలా శుభ ఫలితాలు ఉన్నాయి. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వారికి నైధనతార గావున వ్యతిరేకత ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : మీరు అన్నదానం చేయండి వస్త్ర దానం చేయండి గోపూజ చేయండి మంచి ఫలితాలు పొందగలుగుతారు.

మీన రాశి :

ఈ రాశివారికి శుభాశుభాలు ఎక్కువగానే ఉన్నాయి . ద్వితీయాధిపత్యం వున్న కుజుడు మీకు మేలు చేసే ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తాడు. మీకు జనవరి రెండు మూడు తేదీల్లో మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చంచల స్వభావాన్ని వీడి స్థిర భావాన్ని పొందినప్పుడు మీకు అన్ని రకాల శుభపరంపరలు కొనసాగుతాయి. మీలో కొత్తగా జాడ్యం(అలసత్వం) వచ్చింది. దాన్ని ఒడిసి పట్టుకొని సాధన చేయండి. ఇది శని తాలుక ప్రభావము. అలాగే పాపులతో కూడిన బుధుడు మీకు ఆ రకమైన వ్యవస్థని కలుగజేస్తున్నారు. రాశి అధిపతి గురుడు కొంతవరకు మేలు చేస్తాడు. మీరు తెలివిగా ఉంటే మంచి పనులు చేయ గలరు. ఎవరి మీద అయినా ఆధారపడితే మాత్రం ఇబ్బందులను ఎదుర్కొంటారు. అది ఇంట్లో వాళ్లు కావచ్చు పైవాళ్ళు కావచ్చు. మీ సొంత నిర్ణయం మీకు మేలు చేస్తుంది .కుటుంబ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ధన నష్టం ఉన్నది ముందు జాగ్రత్తకోసం తప్పదు.పూర్వాభాద్ర వారికి నేసిన దారి గావున ఇబ్బందులు ఉన్నాయి ఉత్తరార్ధ శాసన తారుతో వారం ప్రారంభం కాబట్టి అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి రేవతి వారికి కించిత్ ప్రతికూలత కనిపిస్తోంది

పరిహారం : గురు మంత్రాన్ని పఠించండి లేదా హయగ్రీవ స్తోత్రము సహస్రనామ పారాయణ శుభ ఫలితాలని ఇస్తాయి .

Next Story