హైదరాబాద్‌: బాలాపూర్‌ పీఎస్‌ఐ ముందు కిరొసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఏఎస్‌ఐ నర్సింహ మృతి చెందారు. తీవ్రగాయలపాలైన ఏఎస్‌ఐ కంచన్‌బాగ్‌లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతున్న ఏఎస్‌ఐ నర్సింహ మృతి చెందాడు.

అయితే క్రమ శిక్షణ చర్యలో భాగంగా బదిలీ చేయడంతో నర్సింహ కుంగిపోయారు. సీఐ కావాలనే తనపై తప్పుడు నివేదిక ఇచ్చారని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే.

మరోవైవు అబ్దుల్లాపూర్‌మెంట్‌ తహసీల్దార్‌ వియారెడ్డిని సజీవదహనం ఘటనలో గాయాలపాలైన అటెండర్‌ చంద్రయ్య కూడా మృతి చెందారు. గాయాలతో కంచన్‌బాగ్‌లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రితో చికిత్స పొందుతున్న చంద్రయ్య తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో వీరి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం వెంటనే మృతదేహాలను అప్పగించాలంటూ.. నినాదాలు చేశారు. దీంతో ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు ఆందోళనను అదుపు చేస్తున్నారు.

Newsmeter.Network

Next Story