నర్సంపేటలో ఆర్మీ జవాన్‌ హత్య..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2019 7:53 AM GMT
నర్సంపేటలో ఆర్మీ జవాన్‌ హత్య..

వరంగల్‌ రూరల్‌: నర్సంపేటలో శనివారం రాత్రి ఆర్మీ జవాన్‌ ప్రేమ్‌ కుమార్‌ దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుడి బర్త్‌ డే వేడుకల్లో చెలరేగిన వివాదం ఆర్మీ జవాన్‌ హత్యకు దారి తీసింది. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో యువకుల మధ్య గొడవ చెలరేగింది. ప్రేమ్‌ కుమార్‌ గొడవను రాజీ చేసుకునేందుకు ప్రయత్నించగా.. యువకులు కత్తులు, స్కూ డ్రైవర్లతో దాడి చేశారు. దీంతో మిగిలిన స్నేహితులు ప్రేమ్‌ కుమార్‌ను నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గత మూడు రోజుల క్రితం సెలవులపైన జవాన్‌ ప్రేమ్‌ కుమార్‌ ఇంటికి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it