ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
By సుభాష్Published on : 23 Feb 2020 7:04 PM IST

గుంటూరు జిల్లాలో శనివారం కాల్పులు జరిపిన ఆర్మీ ఉద్యోగి బాలాజీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నడింపల్లికి చెందిన రమాదేవి కూతుర్ని ప్రేమిస్తున్నానంటూ వేధించిన బాలాజీ.. ప్రేమను రమాదేవి ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన బాలాజీ ఆమె ఇంటికి వచ్చి రమాదేవిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రమాదేవి గాయపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన చేరుకునే లోపే ఆయన పరారయ్యాడు.
దీంతో పోలీసులు బాలాజీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రేమించిన అమ్మాయి కాదనడంతో మనస్థాపానికి గురైన ఆర్మీ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అతని కోసం గాలింపు చేపడుతుండగా, రైలు పట్టాల వద్ద ఆయన శవం కనిపించింది. శవాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story