ఢిల్లీ: ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లర్లకు నేతృత్వం వహించచేవారు ఎప్పటికి నేతలు కాలేరని రావత్‌ అన్నారు. నిజమైన నేతలు క్రమశిక్షణతో ఉంటారు.. హింసను ప్రేరేపించరని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు జరుగుతున్న సందర్భంగా బిపిన్‌ రావత్‌ స్పందించారు. ఆర్మీని చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలని సూచించారు. యూనివర్సిటీల్లో, విద్యా సంస్థల్లో ఆందోళనలు చేయడం తగదన్నారు. దేశంలో జరుగుతున్న హింసాత్మక నిరసనలను రావత్‌ ఖండించారు. విద్యార్థులను నాయకులు ఆందోళనల వైపు నడిపించడం సరికాదన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. విద్యార్థులు, ఆందోళనకారులు రోడ్ల మీదకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీలో జామియా యూనివర్సిటీతో సహా పలు యూనివర్సిటీల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌, ఎంఐఎం నేతలు తప్పుబట్టారు. ఆర్మీ చీఫ్‌కు రాజకీయాలు ఎందుకని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. రావత్‌ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్‌ మండిపడుతోంది

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.