ఆర్మూర్ కుర్రాడికి అదిరిపోయే ప్యాకేజీ ఇచ్చిన మైక్రో సాఫ్ట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sep 2019 12:29 PM GMT
ఆర్మూర్ కుర్రాడికి అదిరిపోయే ప్యాకేజీ ఇచ్చిన మైక్రో సాఫ్ట్

హైదరాబాద్: గోకరాజు గంగరాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికి చెందిన కంప్యూటర్ సైన్స్ నాలుగో సంవత్సరం విద్యార్థికి మైక్రో సాఫ్ట్ ఊహించని ప్యాకేజీ ఇచ్చింది. అంకరిగారి బి. రోహన్ అనే విద్యార్థిని భారీ ప్యాకేజితో మైక్రోసాఫ్ట్ సంస్థ ఉద్యోగానికి ఎంపిక చేసింది. రూ.41.6 లక్షల వార్షిక వేతనంతో క్యాంపస్ సెలెక్షన్ లో రోహన్ సెలక్ట్ అయ్యాడు. గోకరాజు కళాశాల నుంచి మైక్రోసాఫ్ట్ సంస్థ ఇంత భారీ ప్యాకేజీ మొదటి సారి ఆఫర్ చేసింది. ఈ ఉద్యోగాన్ని సాధించడం ద్వారా రోహన్ తమ కళాశాల ప్రతిష్ఠను ఇనుమడింపజేశారని ప్రిన్సిపల్ జె.ప్రవీణ్ అభినందించారు. రోహన్ స్వగ్రామం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్.

Next Story
Share it