యువ హీరో నిఖిల్, లావ‌ణ్య జంట‌గా న‌టించిన‌ చిత్రం ‘అర్జున్ సుర‌వ‌రం’. ఈ చిత్రానికి సంతోష్ దర్శకత్వం వ‌హించారు. ఇందులో నిఖిల్ జ‌ర్న‌లిస్ట్ గా న‌టించారు. ఈ సినిమాని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని.. కొన్ని కార‌ణాల వ‌ల‌న కుద‌ర‌లేదు. ఆ త‌ర్వాత రెండు మూడు సార్లు రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టికీ… రిలీజ్ చేయ‌లేదు. దీంతో అస‌లు ఈ సినిమా రిలీజ్ అయ్యిందో..? లేదో..? కూడా తెలియ‌ని ప‌రిస్థితి.

Image result for NIKHIL HERO ARJUN SURAVARAM

Image result for NIKHIL HERO ARJUN SURAVARAM

ఇదిలా ఉంటే… హీరో నిఖిల్ ట్విట్ట‌ర్ లో ఈ సినిమా గురించి స్పందిస్తూ… సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్. .డేట్ దొరికేసిందోచ్ అంటూ ‘అర్జున్ సుర‌వ‌రం’ త్వ‌ర‌లోనే రిలీజ్ అని తెలియ‌చేశాడు. అంతే కాకుండా… ఇన్నాళ్లు మిమల్ని వెయిట్ చేయించానని తెలుసు.. ఓపికగా ఎదురుచూసినందుకు థాంక్స్ చెప్పాడు. ఈ వారంలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాన్నాడు. మ‌రి.. ఈసారైనా చెప్పిన డేట్ కి రిలీజ్ చేస్తారని ఆశిద్దాం.

Image result for NIKHIL HERO ARJUN SURAVARAM

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.