రవి ప్రకాష్‌పై నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Oct 2019 2:00 PM GMT
రవి ప్రకాష్‌పై నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు

హైదరాబాద్‌: నాంపల్లి కోర్టులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ధర్మాసనం కస్టడీ పిటిషన్‌ తీర్పును రేపటికి వాయిదా వేసింది. కాగా టీవీ9 యాజమాన్యానికి తెలియకుండా రూ.18 కోట్లు రవి ప్రకాష్‌ అక్రమంగా డ్రా చేసుకున్నాడని కోర్టు ఎదుట పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు. ఈ కేసులో రవి ప్రకాష్‌ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అనేక కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. 10 రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టును పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోరారు. తన అధికార దుర్వినియోగంతో ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్‌, ఎక్స్‌గ్రేషియాను అక్రమంగా దొంగిలించారని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు ఇవ్వడం జరిగిందన్నారు. రవిప్రకాష్‌ బ్యాంక్‌ స్టేట్మెంట్‌లను న్యాయవాది కోర్టుకు అందజేశారు.

Next Story