12 ఆదివారం నుండి 18 శనివారం వరకు వార ఫలాలు

By రాణి  Published on  12 April 2020 10:50 AM GMT
12 ఆదివారం నుండి 18 శనివారం వరకు వార ఫలాలు

మేష రాశి :

ఈ రాశివారికి శుభ పరంపరలు కొనసాగుతున్నాయి. రవి ఉచ్ఛ క్షేత్రంలోకి రావడం మేషరాశి అధిపతి అయిన కుజుడు ఉచ్చలో ఉండటం వల్ల వీరికి పదోన్నతితో కూడిన స్థానచలనం ఊహించవచ్చు. వారం మధ్యలో మీరు సంతోషకరమైన వార్తను వింటారు. అలాగే మీకు మిధునం లో ఉన్న రాహువు కూడా సంపద కారకుడయ్యాడు. చంద్రుడు కూడా సౌఖ్య లాభాల్ని కలుగజేస్తున్నాడు. ఈ శుభ ఫలితాల్ని తగ్గినట్టుగా మీకు శత్రు వృద్ధి ఉంది. అలాగే మానసిక ఆందోళన కూడా కలుగజేస్తాడు. కాస్తంత అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీకు పై అధికారుల ఒత్తిడి లేదా రాజకీయ ఒత్తిడులు కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుంది. దీనికికారణం శని స్థితి కొద్దిగా బాగులేదు. మీకు శ్రమ అధిక మవుతుంది . ఫలితం తక్కువగా వస్తుంది. దేని కారణం గురుస్థితి మీ ఆలోచనలు మీకు ఉపయోగ పడవు. అశ్విని వారికి పరమ మిత్ర తారైంది. శుభ ఫలితాల్ని ఇస్తున్నది. భరణి వారికి మిత్ర తారైంది. మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కృత్తిక ఒకటో పాదం వారికి మాత్రం నైధన తారైంది. వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి .

పరిహారం :- విష్ణు సహస్ర నామ పారాయణ, అమ్మవారి పూజ మంగళవారంనాడు చేయండి. మంచి ఫలితాలను పొందగలుగుతారు.

వృషభ రాశి :-

ఈ రాశివారికి శుక్రుడు స్వస్థానంలో ఉండటం వల్ల శరీర సౌఖ్యం చక్కనైన ఆలోచనలను ఇస్తాడు. గురు స్థితి వల్ల ధనలాభంతో పాటు మీరు ఆనందాన్ని కుటుంబంతో ఎక్కువగా పొందగలుగుతున్నారు. అనారోగ్య మూలకంగా ధన వ్యయాన్ని పొందక తప్పదు. ఎంత మౌనంగా ఉన్నా అకారణ కలహాలు మీకు తప్పవు. గతంలో చేసిన పొరపాట్లకు మీరు ఇప్పుడు సమాధానం ఇచ్చుకోవడం గానీ లేదా ఒక శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ జాతకులకు వారం మధ్యలో ధనలాభం ఉంది. అనుకోకుండా మీకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మోకాళ్ల నొప్పులు పిక్కల నొప్పులు తొడల నొప్పులు ఇవన్నీ కూడా మీకు తప్పకుండా సంప్రాప్తం అవుతున్నాయి. వీటిని నిరోధించటానికి యోగసాధన శరీర వ్యాయామం చేయండి . కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి నైధన తారైంది అశుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. రోహిణి వారికి సాధన తారైంది కాబట్టి శుభ ఫలితాలని పొందగలుగుతారు. మృగశిర ఒకటి రెండు పాదాల వారికి ప్రత్యక్ తారైంది కాబట్టి ఫలితాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి.

పరిహారం :- ఈ రాశివారికి కాలసర్ప దోషం ఎక్కువగా వర్తిస్తుంది కాబట్టి వీరు ఉదయం సాయంకాలములందు శివుని దర్శనము అభిషేకము చేయుట వల్ల చాలా మంచి ఫలితాలు ఇస్తాయి .

మిధున రాశి :-

ఈ రాశివారికి కలిసొస్తున్న శుభ ఫలితాల్లో చిన్నచిన్న ఆటంకాలు ఈ వారంలో ప్రారంభం కానున్నాయి. రాశిలో ఉన్న రాహు భయాన్ని కలుగజేస్తున్నాడు. మీ నిర్ణయాలకు వ్యతిరిక్తంగా పనిచేసే కేతువు కుజుడు శత్రు వృద్ధిని కలుగజేస్తున్నారు. ఆ కారణంగానే శిక్షింపబడే అవకాశాలు ఉన్నాయి. ఇన్నాళ్లు కాపాడుకుంటూ వస్తున్న శరీరారోగ్యం మీకు నశిస్తుంది. ఒకానొక సమయంలో శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. అయితే ఎప్పటికప్పుడు మీకు బుధుడు సంతోషాన్ని కలిగించగా రవి ధనలాభాన్ని సూచిస్తు న్నాడు. మీ బంధువులు ఆత్మీయులతో ఎడబాటు మీకు చాలా ఇబ్బందిని కలగజేస్తుంది. మీచుట్టుప్రక్కల వాళ్ళు మీకు ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తారు. మృగశిర మూడు నాలుగు పాదాల వారికి ప్రత్యక్ తారైంది వ్యతి రిక్త ఫలితాలున్నాయి ఆరుద్రా నక్షత్రం జాతకులకు మాత్రం క్షేమ తారైంది కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పునర్వసు ఒకట్రెండు మూడు పాదాల వారికి విపత్తారయింది ఇబ్బందులు సూచిస్తున్నాయి.

పరిహారం :- సరికి జపం చేయించండి నువ్వులు దానం చేయించిన దీపదానం చేయించిన మంచి ఫలితాలు లభిస్తాయి .

కర్కాటకరాశి :-

ఈ రాశి వారికి ఈ వారంలో కొద్దిపాటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీకు ఒక ప్రక్క కార్యానుకూలత మరోప్రక్క దానికి తగ్గ విచారం సకాలంలో ఏ పని కూడా పూర్తి కాకపోవడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. విశేష ధనం ఎంతైతే ఉందో ద్రవ్య నష్టం కూడా అంతే కనిపిస్తోంది. మనోధైర్యం కొద్దిగా తగ్గిపోతుంది. మీరు తలపెట్టిన పనులన్నీ కూడా కాస్త వాయిదా పడుతూ ఉంటాయి. అయితే మీకు సరియైన మిత్రులు లభించినట్లయితే వారి ద్వారా మీ పనులు చక్కబడతాయి. మీరు మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళినట్లయితే కార్య జయాన్ని ధనలాభాన్ని సుఖ సౌఖ్యాల్ని కూడా పొందగలుగుతారు. పునర్వసు నాలుగో పాదం వారికి విపత్తార యింది కాబట్టి ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి. పుష్యమి వారికి సంపత్తార అవ్వడంతో ఫలితాలు చాలా బాగున్నాయి. ఆశ్లేష వారికి జన్మతార అయింది కాబట్టి కష్టే ఫలి అన్నట్లు ఉంటుంది.

పరిహారం :- చంద్రుడు కొరకు పాలు పెరుగుతో శివుని అభిషేకం, గురునకు దక్షిణామూర్తి స్తోత్రం పఠిస్తే శుభ ఫలితాలు ఎక్కువ .

సింహ రాశి :

ఈ రాశివారికి గతంలో వలె శుభ పరిణామాలు శుభ ఫలితాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీరికి విశేషించి ఈ వారంలో మీ ఆలోచనలకి తగ్గట్టుగా విశేష ధన లాభము కోరికలు నెరవేరడం సంతోషము ఇవి కొనసాగుతున్నాయి. మీకు కుటుంబ పరమైనటువంటి సంతోషాన్ని కలుగజేసే వాడు శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి సుఖ సంతోషాలకు తావు ఎక్కువ. మీకు వ్యాపార ఉద్యోగపరంగా కోరికల్ని నెరవేర్చేవాడు బుధుని స్థితి కూడా బాగుంది. చంద్రుని వల్ల వారం మధ్యలో మీరు ధనలాభాన్నే కాదు విశేష ధన లాభాన్ని కూడా పొందగలుగుతారు. ఇందులో అతిశయోక్తి లేదు. ఒకానొక సమయంలో అనారోగ్యము, కార్యహాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా స్వంత ఆలోచనలైతే మీకు ఇబ్బందులు తగ్గుతాయి. మిమ్మల్ని మీఆలోచనల్ని గౌరవించే వాళ్ళని గుర్తించి పనులు చేయించుకుంటే శ్రమ తగ్గి విశేష ఫలితాలు పొందుతారు. మఖ నక్షత్రం వారికి పరమ మిత్ర తారైంది మధ్యమ ఫలితాలు. పుబ్బ నక్షత్ర జాతకులకు మిత్ర తారైంది శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర ఒకటో పాదం వారికి నైధన తారవ్వడంతో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి .

పరిహారం :- మంగళవారం నాడు రాహు పూజ చేయించండి సూర్య నమస్కారాలు చేయించండి.

కన్యారాశి :-

ఈ రాశివారికి సానుకూలమైన పరిస్థితులు కొద్దికొద్దిగా పెరగబోతున్నాయి. రవి కుజులు ఉచ్చలో ఉన్నందు వల్ల కాస్త అనారోగ్యము భయము చోటు చేసుకున్నప్పటికీ కూడా ఆలోచనలో మార్పు వల్ల స్థిరమైన అభిప్రాయాల వల్ల మంచి జరుగుతుంది. మీకంటే పెద్ద వారు మీ శ్రేయస్సును కోరే వారి సహాయ సహకారాలని మీరు పొందగలుగుతారు. ఈ వారం మీకు గౌరవంలో తేడా కనిపించినప్పటికీ బుధుని స్థితివల్ల హాయిగా ముందుకు నడుస్తుంది. పిల్లల ఆరోగ్యం జాగ్గత్త చూసుకోండి. స్థిరాస్తి విషయాల్లో మీకు ప్రస్తుతానికి ఏ రకమైన లాభాలు చేకూరవు. పరిష్కారం కోరుతున్న కోర్టు వ్యవహారాదులు ఇప్పట్లో సానుకూల పడే అవకాశాలైతే లేవు. మీ అభిప్రాయాలను వ్యతిరేకించేవారే ప్రస్తుతానికి ఎక్కువగా ఉన్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి ఉత్తర ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి నైధన తారైంది వ్యతిరేక ఫలితాలున్నాయి. హస్తవారికి సాధన తారైంది కాబట్టి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చిత్త ఒకట్రెండు పాదాల వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి జాగ్రత్త వహించండి.

పరిహారం :- బుధవారం నియమాన్ని పాటించండి. నానబెట్టిన పెసలు బుధవారం ఆవుకు తినిపించండి. విష్ణుసహస్ర నామ పారాయణ నియమబద్ధంగా చేయండి.

తులారాశి :-

ఈ రాశివారికి ఈ వారంలో ధనవ్యయం ఎక్కువ కనిపిస్తోంది. ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా మీకు వాటిని అనుభవించి ఆనందించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎటు చూసినా శత్రు బాధలు, రుణ బాధలు మీకు ఇబ్బంది పెడితే ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే అవుతుంది. వారం మధ్యలో మీరు కాస్తంత మంచిని పది మందితో పంచుకుంటారు. తీవ్రమైన కడుపునొప్పి, తీవ్ర ఉదర రోగం గలవారికి దీర్ఘ రోగులకు కొంచె ఇబ్బందికరమైన పరిస్థితి. అర్ధాష్టమ శని అయినప్పటికీ ఈ వారంలో శని సహకరిస్తాడు. బుధ, శుక్రవారాల్లో మీరనుకున్నది సాధిస్తారు. ఆర్ధిక నష్టాన్ని పొందే అవకాశం ఉంది. పనులలో ఆటంకాల వల్ల మీకు విచారం ఎక్కువగా కలగబోతోంది. దాన్ని అధిగమించడానికి ఏకాగ్రతతో మెలగండి. చిత్త ఒకటి రెండు పాదాలు వారికి ప్రత్యక్ తారైంది వ్యతి రిక్త ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. స్వాతి వారికి క్షేమ తారైంది చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. విశాఖ ఒకటి, రెండు, మూడు పాదాలు వారికి విపత్తు తార అయింది. ఫలితాలు అధమ స్థితిలో ఉన్నాయి.

పరిహారం :- శుక్రవారం నియమాన్ని పాటించండి. అమ్మవారి పూజలు ఖడ్గమాల పారాయణ చేయండి.

వృశ్చిక రాశి :-

ఈ రాశి వారికి కత్తిమీద సాములా ఈవారం నడవబోతోంది. మీ మాటలకు విలువ తగ్గుతోంది. ధనవ్యయము ఎక్కువగా ఉంది. అనారోగ్య సమయంలో చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి కూడా ఉంది. శత్రువులు నశించి కొంత సౌఖ్యాన్ని ఆనందాన్ని పొందగలరు. మృష్టాన్న భోజనం చేస్తారు. అప్పు బాధ ఉన్నప్పటికీ వాటి నుంచి మీరు సులువుగా బయటపడతారు. మీకు చంద్రుడు ధన వ్యయాన్ని సూచిస్తున్నాడు. రాహు, కేతువుల పరిస్థితి మీకు వ్యతిరిక్తంగా మారుతుంది. కాబట్టి మీరు కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం. మీకు ఈ వారం ఒక పరీక్షా కాలంగా ఉంది. మానసికంగా శారీరకంగా విచారాన్ని చవిచూస్తారు. ప్రతి పనిలో ఎదురయ్యే ఆటంకాలను తట్టుకోలేక అవస్థ పడతారు. విశాఖ నాలుగో పాదం వారికి విపత్తారయింది వ్యతిరేక ఫలితాలున్నాయి. అనూరాధ వారికి సంపత్తారైంది పూర్తి అనుకూల పరిస్థితులున్నాయి. జ్యేష్ట వారికి జన్మతార రోగ బాధ సూచిస్తోంది.

పరిహారం :- వీరు మంగళవారం నియమాన్ని పాటించండి సుబ్రహ్మణ్య పూజ చెయ్యండి రుద్రాభిషేకం మంచి ఫలితాలని ఇస్తుంది.

ధనురాశి :-

ఈ రాశివారికి శుభఫలితాలు తగ్గుతున్నాయి. ద్వితీయ గురు, శని, కుజులు పూర్తిగా వ్యతి రిక్త ఫలితాల్ని కలగజేస్తున్నాయి. మీ ఆలోచనలన్నీ కూడా ఇతరులకి ఉపయోగపడతాయి తప్ప మీకు ఏమాత్రం కూడా లాభించే అవకాశం లేదు. గురుడి ప్రభావం చంద్రుని వల్ల కొంత సమయానికి తోడు పడి మీరు కష్టాల్లోంచి బయటికొస్తారు. మీకు శత్రు వృద్ధి ఉంది. ఒకప్పుడు అందరూ మీవారే. ఇప్పుడు మీకు అందరూ పైవారే. వారిని చూస్తేనే భయం ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. అపకీర్తి పొందే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంతవరకు మాటలు తగ్గించండి. చేతల్లో కూడా మీరు తొందరపాటు ఆవేశం లేకుండా నిదానంగా వ్యవహరించండి. మూలా నక్షత్ర జాతకులకు పరమమిత్రతారయింది చాలా బావుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మిత్ర తారైంది శుభ ఫలితాలు ఎక్కువ . ఉత్తరాషాఢ నక్షత్ర ఒకటవ పాదం వారికి నైధన తారైంది కాబట్టి పరిస్థితులు వ్యతిరిక్తంగా ఉన్నాయి.

పరిహారం :- మీరు శని ప్రభావం తగ్గడం కోసం నువ్వులు దానం చేయండి శనివారం నాడు వెంకటేశ్వరస్వామి దర్శనం చేయండి.

మకర రాశి :-

ఈ రాశి వారికి ఈవారం విచారణతోనే ప్రారంభం కాబోతోంది. ధనాదాయం తగ్గి శత్రువులు భాధిస్తారు. రుణ బాధలు తట్టుకోలేక కోపతాపాలకు గురి అవుతారు. బంధుమిత్రులు మిమ్మల్ని అప్పుడప్పుడు పరామర్శ చేస్తారు. కాని వారి వల్ల మీకు సుఖ సౌఖ్యాలు తక్కువగానే ఉన్నాయి. కష్టేఫలి అన్నట్లుగా మీకు పరిస్థితి వ్యతిరేకంగా ఉంది. కష్టసమయంలో స్థానచలనం కూడా జరగవచ్చు. అనుకోని అవాంతరాల వల్ల ధనవ్యయము ఎక్కువగా ఔతుంది. శని స్వస్థానం జన్మ స్థానంలో ఉండటం చేత ధనవ్యయము ఆపదలు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటాయి. కొన్ని సమయాల్లో మీరు నిగ్రహాన్ని కోల్పోతారు. సుగర్ బీపీ అస్త్మా వంటివి రాబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరము. సకాలంలో భోజనం తీసుకుంటే మంచిది. ఎదుటివారిని బట్టి మీరు ప్రవర్తించండి. ఉత్తరాషాఢ రెండు, మూడు, నాలుగు పాదాల వారికి నైధనతారైంది వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు సాధన తారైంది మంచి ఫలితాలున్నాయి. ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు వారి ప్రత్యక్ తారైంది కాబట్టి వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- శనీశ్వరునికి జపం చేయించండి. నువ్వులు దానం విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభ రాశి :-

ఈ రాశివారికి వ్యయ స్థానంలో శని ఉన్నప్పటికీ కొన్ని శుభ ఫలితాలని పొందగలుగుతున్నారు. కుటుంబంలో సౌఖ్యము, సుఖము, లాభము, విశేష ధనార్జన, కష్టపడిన దానికి మంచి ఫలితమే. మీ ఆలోచనలకు తగ్గ మంచి రోజులు వచ్చాయి. ధనవ్యయం తప్పదు. ఒక ఆభరణాన్ని కూడా మీరు పొందే అవకాశం ఉంది . కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. సంపదను సమకూర్చుకుంటారు. కుటుంబంతో హాయిగా ఆనందంగా గడుపుతారు. ఎన్ని ఉన్నా వీరు ఏదో ఇంకా పొందాలనే ఆలోచన మీకు కలుగుతూనే ఉంటుంది. దానివల్ల కాస్త ధన నష్టం కూడా వుంది. మీ మాటల వల్ల స్థానచలనానికి కూడా అవకాశం ఉంది. కాన జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు మంచి ఫలితాలే ఈ వారంలో కనిపిస్తాయి. ధనిష్ఠ మూడు, నాలుగు పాదాలు వాళ్లకి ప్రత్యక్ తారయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలున్నాయి. శతభిషా నక్షత్ర జాతకులకు క్షేమ తారైంది మంచి ఫలితాలు పొందుతున్నారు. పూర్వాభాద్ర ఒకట్రెండు మూడు పాదాలు వారికి విపత్తు తారైంది వ్యతి రిక్త ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- శనికి జపం చేయించండి తైల దీపాలు వెలిగించండి నువ్వులు దానం చేయండి నల్లని వస్త్రదానం కూడా చేయండి. రుద్ర పారాయణ మంచిది.

మీనరాశి :-

ఈ రాశివారికి శుభ ఫలితాలు మధ్యమంగా ఉన్నాయి. గౌరవ భంగం వాటిల్లినా సుఖ సౌఖ్యాలు ధనానికి ఇబ్బంది లేకుండా ముందుకు సాగిపోతారు. గురుడు మంచి ఫలితాన్నిస్తాడు. బుధుడు ఇబ్బందిని కలుగజేస్తున్నాడు. రవి చెప్పుకోలేనంత భయాన్ని కలుగజేస్తాడు. పెద్దల చేత, అధికారుల చేత మాట పడే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకుంటే మంచి ఫలితాలున్నాయి. మీ చేతల ద్వారా ఎదుటి వారిని మెప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు మీ మాటలు కూడా తోడ్పడతాయి కాబట్టి మంచి అవకాశాన్ని వదలకుండా ఉంటే మంచి ఫలితాన్ని పొందగలరు. వారం మధ్య నుంచి మీకు చంద్ర ఫలితం ధనాదాయానికి దోహదపడుతుంది. మీ చేతలకు గుర్తింపు లభిస్తుంది. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి విపత్తారైంది వ్యతిరేక ఫలితాలున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు సంపత్తారైంది కాబట్టి మంచి ఫలితాలున్నాయి. రేవతి వ వారికి జన్మ తారైంది కాబట్టి కాస్త అనారోగ్య సూచన కనిపిస్తుంది.

పరిహారం :- దక్షిణామూర్తి స్తో స్తోత్రం చదవండి అలాగే పెరుగుతూ పాలతో రుద్రాభిషేకం చేయండి.

Next Story
Share it