కృష్ణా: మచిలీపట్నం జెడ్పీ కన్వెన్షన్ సెంటర్‌లో అధికారులు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. విభజన అనంతరం ఏపీ ప్రభుత్వం తొలిసారి అధికారికంగా.. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ రోజు నుంచి వరుసగా 3 రోజులు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ: నవరత్నాలతో రాష్ట్రంలో సీఎం సరికొత్త మార్పు తీసుకోచ్చారని నాని తెలిపారు. ప్రతిపక్షం నుంచి ఎన్నో సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట కోంస సీఎం జగన్‌ ముందుకు నడుస్తున్నారన్నారు. తమ పరిపాలనలో సీఎం విప్లవాత్మక మార్పులకు నాంది పలికారన్నారు. పారదర్శక పాలన కోసం సచివాలయ వ్యవస్థ గత ప్రభుత్వం మాదిరి కాకుండా.. అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.