సాగర తీరంలో కాదు.. విజయవాడలోనే గణతంత్ర వేడుకలు

By Newsmeter.Network  Published on  21 Jan 2020 10:29 AM GMT
సాగర తీరంలో కాదు.. విజయవాడలోనే గణతంత్ర వేడుకలు

విశాఖలో నిర్వహించాల్సిన గణతంత్ర వేడుకలు రద్దయ్యాయి. విశాఖలో ఏర్పాట్లను అధికారులు నిలిపివేశారు. విజయవాడ వేదికగా గణతంత్ర వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే అధికారులకు చేరాయి. దాంతో ఏర్పాట్లపై అధికారులు నిమగ్నమయ్యారు. ఏపీ రాజధానిని మూడు ప్రాంతాల్లో పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈసారి అక్కడే నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అమరావతి రైతుల నిరసనలు కూడా రోజు రోజుకు పెరగడంతో విశాఖలోనే ఉంటాయని అంతా అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో విజయవాడకు మార్చడం విశేషం.

సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో వేడుకల నిర్వహణ బాధ్యతలను జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. అలాగే ఇతర సౌకర్యాలకల్పన, మీడియా కవరేజ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌ సౌకర్యాలు, ఇతర అరశాల బాధ్యతను సమచార శాఖకు, భద్రత ఏర్పాట్ల బాధ్యతను డిజిపి, నిఘా అదనపు డిజిలకు అప్పగించారు. అలాగే విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌, ఆర్‌ ఆండ్‌ బి, ఎపిఎస్‌పి బెటాలియన్‌ ఐజిలకు కూడా వివిధ బాధ్యతలు అప్పగించారు.

Next Story
Share it