రాజ్‌భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం

రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ రాజ్‌ భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఎట్‌ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌, మంత్రులు బొత్స సత్యనారాయణ, రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పలువురు ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు హాజరయ్యారు. కాగా,  ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఏపీలో ఎట్‌హోం జరగడం తొలిసారి. ఈ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం జరిగిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.