ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Nov 2019 7:58 AM GMT
ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.జర్నలిజంలో శ్రీనాథ్‌కు అపార అనుభవం ఉంది. వైఎస్ఆర్‌ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామం. జర్నలిజం వృత్తిని ఆంధ్రప్రభ ద్వారా ప్రారంభించారు. 1978లో జర్నలిజంలోకి అడుగు పెట్టారు. నాలుగు దశాబ్దాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు.

వైఎస్ఆర్‌ జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి అనేక వ్యాసాలు రాశారు. 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ మంచి పేరు తెచ్చాయి. శ్రీనాథ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహిత జర్నలిస్టు కూడా.

సీఎం జగన్ ఆశయాల మేరకు పనిచేస్తా - శ్రీనాథ్ దేవిరెడ్డి

ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమించినందుకు సీఎం వైఎస్ వైఎస్‌ జగన్‌కు శ్రీనాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం చేపట్టే కార్యక్రమాలు విజయవంతానికి కృషి చేస్తానన్నారు.

ap-press-academy-chairman-srinath-devireddy

Next Story
Share it