చంద్రబాబుగారు అవేం మాటలు..!- లేఖలో పోలీసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Oct 2019 4:13 PM GMT
చంద్రబాబుగారు అవేం మాటలు..!- లేఖలో పోలీసులు

అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మాటలను పోలీస్‌లు మరోసారి లేఖలో ఖండించారు.

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్ సభలో పోలీసులను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వారు తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు పదేపదే తమను టార్గెట్ చేసి మాట్లాడటాన్ని తప్పుబట్టారు పోలీసులు. చంద్రబాబు వాలకం చూస్తుంటే...అశాంతి, అసహనాన్ని సృష్టించి పోలీసులపై తిరుగుబాటు చేయాలనే భావన మీలో ఉన్నట్లుందన్నారు. పోలీస్‌ శాఖ క్రమశిక్షణ కలిగిన బాధ్యతాయుత శాఖ అని తెలిపారు.

ఎంతటివారైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. దాదాపు 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి పోలీసుల పని తీరును తప్పుబట్టడం బాధకరమని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ నేతలు కూడా పోలీసులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. తీరు మార్చుకోకపోతే న్యాయపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని లేఖలో చంద్రబాబును పోలీసులు హెచ్చరించారు.

Next Story
Share it